హైదరాబాద్

బల్దియా ‘స్వచ్ఛ’పనులకు కేంద్రం ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : స్వచ్ఛసర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు, నగరంలో నూటికి నూరు శాతం స్వచ్ఛత సాధనే లక్ష్యంగా బల్దియా నిర్వహిస్తున్న కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. దిల్లీలో సస్టైనబుల్ శానిటేషన్ అంశంపై ఆదివారం జరిగిన వర్క్‌షాప్‌కు కమిషనర్ దాన కిషోర్ హాజరయ్యారు.
సంపూర్ణ స్వచ్ఛత కోసం నిర్వహిస్తున్న సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమాల గురించి కమిషనర్ వర్క్‌షాప్‌లో వివరించారు. అంతేగాక, ఇదే అంశంపై జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన తిలకించారు
. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి, జలశక్తి అభియాన్ కేంద్ర కార్యదర్శిని కలిసిన కమిషనర్ నగరంలో మెరుగైన శానిటేషన్, సంపూర్ణ స్వచ్ఛత, జలసంరక్షణ కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించగా, కేంద్ర కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ ప్రత్యేకంగా అభినందించినట్లు బల్దియా అధికారులు తెలిపారు. నీరు వృథా కాకుండా కాపాడుకునేందుకు, నీటిని పొదుపుగా వినియోగించుకునేందుకు, జలాన్ని సంరక్షించుకునేందుకు జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు జలశక్తి అభియాన్ ప్రమాణాలను ప్రతిబింబించేలా ఉన్నాయని అభినందించినట్లు తెలిపారు. సోమవారం జరగనున్ను ఈ వర్క్‌షాప్ రెండోరోజు కార్యక్రమంలో కమిషనర్ సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్, జలసంరక్షణలో భాగంగా ఎస్‌టీపీల ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సమర్పించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

*