హైదరాబాద్

‘సాంఘిక సంస్కరణ ఉద్యమాలు’ పుస్తక ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : ప్రముఖ రచయిత సింగారెడ్డి ఇన్నారెడ్డి రచించిన ‘సాంఘిక సంస్కరణ ఉద్యమాలు’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే.శ్రీనివాస్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. చరిత్ర ముఖ్యమైన రాజకీయ అంశంగా పుస్తకం ఉందని, నేటి పత్రికల్లో అనేక చరిత్రకు సంబంధించిన వ్యాసాలు కూడా వస్తున్నాయని అన్నారు. భారత జాతీయోద్యమం 1919లో మొదలైదని, జాతీయ ఉద్యమం కంటే ముందు సంఘ సంస్కరణ ఉద్యమం వచ్చిందని వివరించారు. సామాజిక అంశాలకు సంబంధించి ఇలాంటి పుస్తకాలు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. సభాధ్యక్షత వహించిన పూల ఆంతోని మాట్లాడుతూ మనిషిగా జీవించినందుకు ఏదో ఒకటి సాధించాలనే తపనతో రచయిత పుస్తకం రాశారని కొనియాడారు. తన పరిశోధన అంశాలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. జనంలో చైతన్యం తీసుకురావడానికి సంఘిక సంస్కరణ ఉద్యమాలు పుస్తకం దోహద పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రతినిధి లక్ష్మయ్య పాల్గొన్నారు.