హైదరాబాద్

యురేనియం తవ్వకాలతో విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతిని సంరక్షించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని పాలమూరు అధ్యయన వేదిక విమర్శించింది. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు. తెలంగాణలో ఉన్న వనరులను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే కేంద్రం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇస్తుందని దుయ్యబట్టారు. యురేనియం తవ్వకాలతో తీవ్ర విధ్వంసం సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి విలయంతో పాటు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే యురేనియం తవ్వకాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వేదిక నాయకులు రామ్మోహన్, శ్రీనివాస్, స్వామి పాల్గొన్నారు.