హైదరాబాద్

బల్దియా బాండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్‌ఎంసీకి ఆర్థికంగా కొంత ఊరట కల్గించేందుకు అధికారులు అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులకు వేల రూపాయల కోట్లను వెచ్చించటంతో జీహెచ్‌ఎంసీకి అవసరాలకు తగిన విధంగా ఎప్పటికపుడు నిధులను సమీకరించుకోవల్సి వస్తోంది. ఇప్పటికే ఓ దఫా బాండ్ల జారీతో రూ. 395 కోట్లతో నిధులను సమకూర్చుకున్న బల్దియా మరోసారి ఇదే మార్గంలో మరో రూ. 305 కోట్లను సేకరించేందుకు సిద్ధమైంది. ఇందుకుగాను ఈ నెల 20వ తేదీన మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్, అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీలతో కూడిన బృందం ముంబై స్టాక్ ఎక్స్ఛేంజీకి వెళ్లనున్నట్లు తెలిసింది. కొద్దిరోజులుగా స్టాక్ ఎక్స్ఛేంజీ మార్కెట్ లావాదేవీలు లాభసాటిగా లేకపోవటంతో బల్దియాకున్న రేటింగ్ తగ్గటం, అందులో సుమారు 8.5శాతం నుంచి 9.5శాతం లోపు నిర్ణీత ఆదాయానికి మాత్రమే ఈ నిధులను సమకూర్చకోవాలని భావిస్తుండగా, నిన్నమొన్నటి వరకు పరిస్థితులు అనుకూలించలేదు. ఇపుడు జీహెచ్‌ఎంసీ బాండ్ల జారీకి పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రూ. 305 కోట్లను సమీకరించుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు. బాండ్ల ద్వారా రెండో దఫాగా రూ.305 కోట్లను సేకరిస్తే ఇప్పటి వరకు బాండ్ల జారీతో బల్దియా రూ. 700 కోట్లను సమకూర్చుకుంది. అవసరాలను బట్టి మరో రూ. 300 కోట్లను సమకూర్చుకోవాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం.