హైదరాబాద్

క్రీడల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఒలింపిక్ సంఘం తెలంగాణ (ఓఏటీ) ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రాజు అన్నారు. తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో లాల్‌బహదూర్ స్టేడియంలోని హ్యాండ్‌బాల్ కోర్టులో హ్యాండ్‌బాల్ క్రీడాకారులకు కిట్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాష్ రాజు విచ్చేసి క్రీడాకారులకు కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హ్యాండ్‌బాల్ క్రీడాకారులు చక్కటి ప్రతిభను కనపరిచి జాతీయ, అంతర్జాతీయ పోటీలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, హైదరాబాద్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సుధాకర్ రావు, కోచ్ రవి కుమార్ పాల్గొన్నారు.