హైదరాబాద్

తాటి, ఈత చెట్లు నరికేవారిపై కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : అక్రమంగా ఈత, తాటి చెట్లను నరికిన వారిపై అబ్కారి చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. రాష్ట్రంలో తాటి, ఈత చెట్లను రియల్ ఎస్టేట్ సంస్థలు లే అవుట్ పేరుతో ఇష్టారాజ్యంగా నరికి వేస్తున్నారని తద్వారా గీత వృత్తిదారులకు జీవనోపాదిని దూరం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మోకు దెబ్బ రాష్ట్ర కార్మిక కమిటీ ఇచ్చిన వినతి పత్రంపై మంత్రి స్పందించారు. అక్రమంగా చెట్లను నరికేవారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. సచివాలయంలో మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే కోడురు సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర మోకు దెబ్బ కార్మిక కమిటీ ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, రవిగారి ప్రసాద్ గౌడ్. హమాధ్యక్షుడు ఎమ్.విజయ్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.

కశ్మీర్‌లో 371 ఆర్టికల్‌ను అమలు చేయాలి
ఖైరతాబాద్, ఆగస్టు 13: కశ్మీర్ ప్రజల అస్థిత్వాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 371 అమలు చేయాలని హైదరాబాద్ డెక్కన్ డమోక్రటిక్ సెక్యూలర్ అలియన్స్, వాయిస్ ఆఫ్ తెలంగాణ సంస్థలు డిమాండ్ చేశాయి. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయా సంస్థల అధ్యక్షులు కొల్లూరి చిరంజీవి, పాండురంగారెడ్డి మాట్లాడారు. నిన్న, మొన్నటి వరకు ప్రత్యేక హక్కులు కలిగిన కశ్మీర్ 370, 35ఏ రద్దు చేయడాన్ని నిజమైన దేశభక్తులు సమర్ధించరని అన్నారు. కేంద్రం చేసిన చర్య రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారనుందని అన్నారు. దీంతో దేశంలోని బడా సంస్థలు సహజ సిద్దమైన ప్రకృతి అందాలు కలిగిన కశ్మీర్‌లోని స్థలాలను కొనుగోలు చేసి అక్కడి వాతావరణాన్ని సైతం కాలుష్య బరితం చేసే ప్రమాదం ఉందని అన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మిజోరం, హిమాచల్ ప్రదేశ్, మేఘాల రాష్ట్రాల్లో ఉన్న కొనసాగుతున్న ఆర్టికల్ 371లో కశ్మీర్‌ను సైతం చేర్చి అమలు చేయాలని అన్నారు. దీని ద్వారా అక్కడి భూములు, సహజ వనరులపై స్థానికులకే హక్కులు ఉంటాయని అన్నారు. అక్కడ చేపట్టే నియామకాలు కశ్మీరీలకే దక్కేలా కఠినమైన నిబంధనలను అమలు చేయాలని అన్నారు.