హైదరాబాద్

శిథిల భవనాలు నేలమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : సికిందరాబాద్‌లో కొద్దిరోజుల క్రితం ఓ శిథిల భవనం కూలి 13 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలైన ఘటనతో కళ్లు తెరిచిన బల్దియా అధికారులు నగరంలోని ఇలాంటి భవనాలపై చర్యలు మొదలు పెట్టారు. మంగళవారం ఒక్కరోజే చార్మినార్ జోన్ పరిధిలోని 11 శిథిల భవనాలను కూల్చివేసినట్లు, కూకట్‌పల్లి జోన్‌లో ఇలాంటి మరిన్ని భవనాలను ముందస్తుగా ఖాళీ చేయించి, సీజ్ చేసినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. శిథిలావస్థకు చేరి, కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను గుర్తించి, వాటిని ఖాళీ చేయటం, అవసరమైతే పటిష్ట చర్యలు చేపట్టడం, లేనిపక్షంలో సీజ్ చేయటం వంటి కార్యక్రమాలు ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మున్ముందు కూడా కొనసాగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 435 శిథిల భవనాలను గుర్తించామని ప్రకటించిన బల్దియా అధికారులు ఈ సంవత్సరం 2019లో అదనంగా మరో 331 శిథిల భవనాలను గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 766 శిథిల భవనాల్లో ఇప్పటి వరకు 191 భవనాలను అధికారులు కూల్చివేశారు. మరో 133 భవనాలను ఖాళీ చేయించి, పటిష్ట చర్యలు చేపట్టగా, మరో 442 భవనాలపై చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందుకుగాను కమిషనర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం భవనాల్లో ప్రమాదకరంగా మారిన వాటిని నేలమట్టం చేయటం, అవసరమైన వాటికి పటిష్ట చర్యలు చేపట్టడం, ఖాళీ చేయటం వంటి చర్యలు కొనసాగించనున్నట్లు తెలిపారు. వీటిలో నివసిస్తున్న వారి ప్రాణాలను రక్షించేందుకు వీటిని ఖాళీ చేసి, ఒకవేళ ఇవి కూలినా, ఇరుగుపొరుగు ఇళ్లకు నష్టం ఏర్పడకుండా, వీటి పక్కనుంచి వెళ్తున్న వారికి ముప్పు కలగకుండా చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో నేటికీ నివసిస్తున్న వారు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని, తాము సురక్షితంగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకుని బల్దియా అధికారులకు సహకరించాలని బల్దియా కమిషనర్ దాన కిషోర్ సూచించారు.