హైదరాబాద్

నిమ్స్‌లో పేలిన హీట్ క్లీనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ రోగులకు డయాలసిస్ నిర్వహించే గదికి పక్కన ఉన్న యువీ పైప్‌లైన్ హీట్ క్లీనర్ పేలింది. శనివారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డయాలసిస్ రోగులకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్ రాకుండా అడ్డుకునేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుంది. ప్రమాదం విషయం తెలుసుకున్న సిబ్బంది తక్షణమే అప్రమత్తమై మరమ్మతులు నిర్వహించారు.

అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, జూలై 20: బృందావనం సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘స్వరం ఒక వరం’ పేరిట సినీ సంగీత విభావరి శనివారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ఘంటసాల గానసభ అధ్యక్షుడు డా.కేవీ రావు పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. ప్రముఖ గాయకుడు వై.సుబ్రహ్మణ్యం నిర్వహణలో గాయనీ, గాయకులు రామ సుబ్రహ్మణ్యం, వేణు, వెంకటేశ్వర రావు, క్రాంతి వర్ధన్, నూకల ప్రభాకర్, శశాంక్, రవళి, అభిజ్ఞ, హరిణి అలపించిన సినీ గీతాలు అలరించాయి.