హైదరాబాద్

లష్కర్‌కు పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, : సికిందరాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళీ దేవాలయానికి శుక్రవారం నుంచే భక్తులు పోటెత్తారు. బోనాల జాతరకు ముందు శుక్రవారం కావటంతో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భారీ సంఖ్యలో మహిళలు, శివసత్తులు తరలిరావటంతో ఆలయ ఆవరణలో సందడి నెలకొంది. ఈనెల 21న ఆదివారం జరగనున్న బోనాల జాతరకు అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముండటంతో ఆ రోజు అమ్మవారిని దర్శించుకునే అవకాశం దొరకకపోవచ్చునని భావించిన భక్తులు శుక్రవారంను మినీ జాతర రోజుగా భావిస్తుంటారు. అమ్మవారి ఒడి బియ్యం, బోనాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. సాయంత్రం పోతరాజుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఆలయ ఈఓ అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కును తీర్చుకున్నారు. ఉదయం నుంచే మహంకాళీ ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరపున దేవాలయానికి రూ.12లక్షల నిధులను మంజూరు చేసినట్లు, శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నుంచి చెక్కును స్వీకరించారు. అనంతరం అంబారీ రాజు ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సుమారు ఐదు వేల మందికి అన్మదాన కార్యక్రమం జరిగింది. ఆదివారం జరగనున్న బోనాలు, సోమవారం నిర్వహించనున్న రంగం కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో తలసాని సమీక్షించారు.

అభిమాన నటుడు రాజేంద్ర ప్రసాద్
కాచిగూడ, జూలై 19: ప్రేక్షకుల అభిమాన నటుడు రాజేంద్ర ప్రసాద్ అని తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వంశీ ఆర్ట్ థియేటర్స్, రేలంగి ఆర్ట్ అకాడమీ, తిరుమల బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు నటకీరిటి డా.రాజేంద్ర ప్రసాద్ 40 సంవత్సరాల సినీ జీవిత విజయోత్స, జన్మదినోత్సవ సందర్భంగా ‘స్వర్ణ కంకణం’తో పాటు పుష్పాభిషేకం కార్యక్రమం శుక్రవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రాజేంద్ర ప్రసాద్‌కు స్వర్ణ కంకణం బహూకరించారు. రాజేంద్ర ప్రసాద్ నటనలో జీవించే వాడని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రజానటి జమునా రమణారావు, నటుడు గిరిబాబు, దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, దర్శకుడు రేలంగి నరసింహ రావు, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, వంశీ అధ్యక్ష, కార్యదర్శులు డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.
గ్రంథిక భాషావాది రామయ్య పంతులు
కాచిగూడ, జూలై 19: గ్రాంథిక భాషావాది రామయ్య పంతులు అని తెలంగాణ బీసీ కమీషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ కీర్తించారు. ప్రముఖ సాహితీవేత్త రామయ్య పంతులు జయంతి సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జూలూరి గౌరీశంకర్ పాల్గొని రామయ్య పంతులు చిత్రపటానికి నివాళి అర్పించారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. అనేక అనేక గ్రంథాలను రచించారని తెలిపారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, నోరి నరసింహ శాస్ర్తీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ, చైతన్య కళాభారతి అధ్యక్షుడు భవనాశి శ్రీనివాస రావు పాల్గొన్నారు.
కళాకారులకు ఆత్మీయ సత్కారం
కాచిగూడ, జూలై 19: అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జీఎన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘నాటక రంగ కళాకారులకు ఆత్మీయ సత్కరం’ కార్యక్రమం శుక్రవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి నటి సాయిలక్ష్మీ చాగంటి పాల్గొని నాటక రంగ కళారులకు ఆత్మీయ సత్కరం చేశారు. అంతరించిపోతున్న నాటక రంగానికి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, దైవజ్ఞశర్మ పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు జీ.శ్రీనివాస్ నిర్వహణలో గాయనీ, గాయకులు వేటూరి రమాదేవి, అరుణ, మాధవి, రజని, రేవతి, గంటి శైలజ, సత్యం వంశరాజ్, గంటి రామకృష్ణ, సురేందర్, నాగరాజు, సుబ్బిరెడ్డి సినీ గీతాలు అలపించారు.

సనాతన ధర్మంలో
జ్యోతిష్యానికి ప్రత్యేక గుర్తింపు
కాచిగూడ, జూలై 19: సనాతన ధర్మంలో జ్యోతిష్యానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పలువురు వక్తలు అన్నారు. ఉజ్వల సంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘బంగారు తెలంగాణ - బోనాల సంబరాలు’లో భాగంగా ప్రముఖ జ్యోతిష్య పండితుడు శివ నరసింహ తాంత్రి, భవిష్య జ్యోతిష్య పండుతురాలు, శ్రీశక్తి పీఠం అధ్యక్షురాలు సురినెడ్డి నారిమణి, ప్రముఖ వేద, జ్యోతిష్య పండితుడు కొత్తూరి వెంకటరమణ శాస్ర్తీ, వేద పండితుడు దీవీ నాగకిషోర్‌కు ‘జ్యోతిష్య శిరోమణి’ బిరుదులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు, మల్కాజ్‌గిరి జడ్జ్ బూర్గుల మధుసూదన రావు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అధ్యక్షుడు వీక్కీ మాస్టర్ పాల్గొని వేద, జ్యోతిష్య పండితులు బిరుదులను ప్రదానం చేశారు. ఎంతో కృషి పట్టుదల ఉంటేనే జ్యోతిష్య రంగంలో రాణిస్తారని పేర్కొన్నారు. ఉజ్వల సంస్థ విలక్షణమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ నృత్య గురువులు హరిప్రియ గౌడ్, సిద్దార్ద్ శిష్య బృందం ప్రదర్శించిన సంప్రదాయ, జానపద, ఫోక్ నృత్యలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంస్థ అధ్యక్షురాలు ఎం.లక్ష్మీ, కల్చరల్ కోఆర్డినేటర్ కే.రాధిక పాల్గొన్నారు.
జలదిగ్బంధంలో శివలింగం
కేశంపేట, జూలై 19: వర్షాలు కురువాలంటూ రైతులు, గ్రామస్థులు శివలింగాన్ని జలదిగ్బంధం చేశారు. శుక్రవారం కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో ఉన్న స్వయంబు శ్రీమహాలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని జలదిగ్బంధం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు నెలన్నర గడుస్తున్నా నేటి వరకు వర్షాలు సక్రమంగా పడలేవని, దాంతో విత్తనాలు విత్తలేక, వేసిన విత్తనాలు మొలకెత్తి ఎండిపోతున్నాయని, దాంతో వర్షాలు కురవాలంటూ అన్నదాతలు, గ్రామస్థులు.. శివలింగాన్ని జలదిగ్బంధం చేశారు. వర్షాలు కురవకపోతే పంటలు పండకపోవడమే కాకుండా తాగునీటికి సైతం అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను భగవంతుడు గమనించి వర్షాలు వచ్చే విధంగా చూడాలంటూ వేడుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మమ్మ, ఆలయ అర్చకుడు జంగం కుమారస్వామి, ఎంపీటీసీ రమాదేవి, మాజీ ఎంపీటీసీ రాములు, ఉపసర్పంచ్ పర్వతాలు, జంగారెడ్డి పాల్గొన్నారు.
శ్రీశత చండీ సహిత మహా రుద్రయాగం
బాలాపూర్, జూలై 19: జిల్లెలగూడ మున్సిపాలిటి ఓల్డ్ గాయిత్రీ నగర్‌లోని శ్రీశారదా లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ సేవా ట్రస్ట్ అధ్వర్యంలో వారం రోజులుగా జరుగుచున్న శ్రీశత చండీ సహిత మహారుద్రయాగంలో బాగంగా శుక్రవారం ఉదయం పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశస, దీక్షీ ధారణం- గోపుజతో పాటు సాయంత్రం యాగశాలా ప్రవేశం, అగ్నిమథనం, అగ్ని ప్రతిష్ఠాపన సర్వతోభద్ర మండపం, నవదుర్గా కలశముల ఆవాహనాలు నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు డీ.వెంకటేశ్వ రావు, ముఖ్య కార్యదర్శి బీ.రాజేశ్వర్ రెడ్డి, వీరబోమ్మ జగన్, సామిరెడ్డి, బుచ్చిరెడ్డి, దీక్షితులు, గందం రమేష్ పాల్గొన్నారు.

మహిళల పట్ల అసభ్య ప్రవర్తన: యువకుడి అరెస్టు
నేరేడ్‌మెట్, జూలై 19: కాలనీలలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని అరెస్టు చేసిన సంఘటన ఎల్‌బినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. కొత్తపేట న్యూ మారుతినగర్‌లో నివసించే గార్లపాటి శివారెడ్డి అలియాస్ శివ(25) బీటెక్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతూ ఖాళీగా ఉంటున్నాడు. కాలనీలలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు, యువతులను వెంబడించి బైక్‌పై వెళ్లి వెనుక నుంచి కొట్టడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు సీపీ తెలిపారు. ఈనెల 12న ఉదయం పది గంటల సమయంలో ఎల్‌బీనగర్ శాతవాహనకాలనీలో నివసించే (19) సంవత్సరాల యువతి పని నిమిత్తం ఎస్‌బీహెచ్ కాలనీలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా శివ ముఖానికి మాస్క్ ధరించి వెనుక నుంచి వెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. అదే సమయంలో ఇంటి వద్ద ఉన్న రవి అనే వ్యక్తి విషయాన్ని 100 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా బండి నెంబర్ కనిపెట్టి శివగా గుర్తించి శుక్రవారం అతన్ని అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు. సామాజిక బాధ్యతతో పోలీసులకు సమాచారం అందించిన రవిని అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ జే.సురేందర్ రెడ్డి, టీ.రవికుమార్, అశోక్ రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.

సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై నిర్లక్ష్యం
నాచారం, జూలై 19: గురుకుల పాఠశాలల పేరుతో సాంఘిక సంక్షేమ హాస్టళ్లను నిర్లక్ష్యం చేయుట తగదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని న్యూ సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు చాలా దయనీయంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మంలోని సంక్షేమ హాస్టల్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో నాలుగో తరగతి చదువుతున్న స్పందన చనిపోవడం చాలా బాధాకరమని చెప్పారు. హాస్టల్‌లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థ ఉంటే సందన మరణించి ఉండేది కాదని పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్టళ్లపై చూపిస్తున్న శ్రద్ధ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై ఎందుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు రక్షణ కరువైందని, బంజరు దొడ్లుగా తయారయ్యాయని ఆరోపించారు. 20 మంది ఉండాల్సిన గదిలో 80 మంది ఉంటున్నారని, గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణపై ఈనెల 22న కమిటీలను ప్రకటిస్తామని, అదే రోజు హాస్టళ్ల లోపాలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. లింగ స్వామి, గోవింద్, నరేశ్, సుధాకర్, శేఖర్ పాల్గొన్నారు.