హైదరాబాద్

పాతబస్తీలో బోనాల సందడి షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆషాఢ మాసంలో రాష్టవ్య్రాప్తంగా జరిగే బోనాల సందడి పాతబస్తీలో శుక్రవారం నుంచి మొదలైంది. పాతబస్తీలోని చారిత్రాత్మక లాల్‌దర్వాజలోని శ్రీసింహవాహిని మహంకాళీ అమ్మవారి ఆలయంపై శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్దంగా కలశస్థాపన చేశారు. కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్, పోలీసు కమిషనర్ అంజనీకుమార్ లాంఛనంగా ప్రారంభించారు. కలశాన్ని స్థాపించేందుకు ప్రత్యేక క్రేన్‌ను ఏర్పాటు చేశారు. ఆలయంపై ధ్వజారోహణ చేసిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో వివిధ దేవాలయాల వద్ద రూ. 25 కోట్లతో పలు పనులు చేపట్టినట్లు తెలిపారు. బోనాల పండుగను పురస్కరించుకుని నగరంలోని అన్ని దేవాలయాలకు దారి తీసే ప్రధాన రోడ్లు, ఫుట్‌పాత్‌లకు మరమ్మతులతో పాటు తదితర పనులను చేపట్టినట్లు వెల్లడించారు. బోనాల ఉత్సవాలు జరిగే రోజుల్లో సామాన్య ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులవు తలెత్తకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేవించినట్లు తెలిపారు. ఈ దేవాలయాల వద్ద హైమాస్ లైటింగ్‌తో పాటు వీది ధీపాలన్నీ సక్రమంగా వెలిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు. దేవాలయాల ఆవరణలో పారిశుద్ద్య పనులపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సీపీఆర్‌ఓ వెంకటరమణ పాల్గొన్నారు.