హైదరాబాద్

కేంద్రమంత్రికి ఎంపీ రంజిత్ రెడ్డి వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రైల్వే సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, లింగంపల్లి నుండి వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలని, వికారాబాద్ నుండి సికింద్రాబాద్ వరకు పుష్‌పుల్ రైలు సర్వీసులు అందించాలని కోరారు. ప్రతి రోజు సాయంత్రం 3 గంటలకు వికారాబాద్ నుండి సికింద్రాబాద్, లింగంపల్లి వరకు ప్యాసింజర్ రైలును వేయాలని, వికారాబాద్ జంక్షన్ వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఆపాలని, మర్పల్లి స్టేషన్‌లో ఎస్పీ - బీదర్- హైడ్- ఇంటర్‌సిటీ- ఎక్స్‌ప్రెస్ వేయాలని, వికారాబాద్ స్టేషన్‌లో గరీబ్ రథ్ ఆపాలని, సికింద్రాబాద్- బెంగులూరు మార్గంలో పెద్దషాపూర్ వద్ద అన్ని ముఖ్యమైన రైళ్లను ఆపాలని, వికారాబాద్ నుండి శతాబ్ది సూపర్ ఫాస్ట్ రైలు ప్రయాణం వరకు టిక్కెట్‌లు జారీ చేయాలని విన్నవించారు. వికారాబాద్ ప్రక్కన కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జిని, వికారాబాద్ నుండి హైదరాబాద్ రహదారికి వంతెనను విస్తరించాలని, వికారాబాద్ నుండి అనంతగిరి పల్లి రహదారి మధ్య ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద , వికారాబాద్ నుండి గోడంగూడ మధ్య గంగారాం సమీపంలో రైల్వే క్రాసింగ్ వద్ద, ఉందానగర్, గొల్లపల్లి, తొండుపల్లిలో మరియు సిద్ధాపూర్, ముబారక్ పూర్‌లలో, వికారాబాద్ పర్లీ మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని, సికింద్రాబాద్ - బెంగులూరు మార్గంలో బుద్వేల్ రైల్వే స్టేషన్ నవీకరణ, తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో వాటర్ ఫౌంటేన్ పార్క్‌ని నిర్మించాలని, బేగంపేట్, నవదగి రైల్వే స్టేషన్‌లలో ఇంటర్‌సిటీ, హుబ్లీ, లింక్, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని, తాండూరు రైల్వే స్టేషన్‌లో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను నిలపాలని విజ్ఞప్తి చేశారు.