హైదరాబాద్

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ మున్సిపల్ కమిషనర్‌లను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మున్సిపల్ ఎన్నికలపై మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వార్డులలో ఓట్ల అవకతవకలపై ఏమైనా ఫిర్యాదులు వచ్చినట్లయితే నార్త్, ఈస్ట్ జియోగ్రాఫికల్ మ్యాప్ ద్వారా ఓటర్ల జాబితాను సరి చూసుకోవాలని కమిషనర్లకు సూచించారు. కొన్ని మున్సిపాలిటీలకు కోర్టు స్టే ఇచ్చినందున వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసుకోవాలని అన్నారు. ఈనెల 21వ తేదీన పీఓలకు, ఓపీఓలకు డివిజన్ స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేలా ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ పద్మజారాణి పాల్గొన్నారు.