హైదరాబాద్

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలో బీసీ రిజర్వేషన్లను 24 శాతం నుంచి 34 శాతానికి పెంచాలని రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మాణం చేసినట్లు మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి మాధవ రెడ్డి కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం రావు అధ్యక్షతన మున్నూరుకాపు రాష్ట్ర మహా సభ సమావేశంలో ఎకగ్రీవంగా తీర్మానం చేశారు. పుట్టం మాట్లాడుతూ.. వచ్చే మున్సిపల్ ఎన్నికలో అత్యధికంగా మున్నూరుకాపులు పోటీ చేయాలని, పోటీ చేసిన ప్రతి మున్నూరుకాపు సోదరుడిని పార్టీలకు అతీతంగా గెలుపించుకోవాలని సూచించారు. తెలంగాణ మున్నూరుకాపు మహాసభను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా తయారు చేయాలని ఆయా జిల్లా అధ్యక్షులకు సూచించారు. కార్యక్రమంలో మహాసభ గౌరవ అధ్యక్షులు వీ.ప్రకాష్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రిటైర్ ఐజీ నుంకరి బాలకృష్ణరావు, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ మీసాల చంద్రయ్య, సెక్రెటరీ జనరల్ మంగళారపు లక్ష్మణ్, కోశాధికారి ఇనంపల్లి వెంకన్న, ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ కమిటీ సభ్యులు వైద్యం వెంకటేశ్వర్లు, చితల చెన్నయ్య, కోట్ల శంకర్ పాల్గొన్నారు.