హైదరాబాద్

బల్దియాలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ప్లాస్టిక్ నిషేధం అమల్లో బల్దియా మరో అడుగు ముందుకేసింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోన్లు, సర్కిళ్ల ఆఫీసుల్లో డిస్పోసబుల్ వాటర్ బాటిళ్లను నిషేధిస్తున్నట్లు కమిషనర్ దాన కిషోర్ ప్రకటించారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో గాజు, స్టీల్ గ్లాసుల ద్వారా అధికారులకు మంచినీరు అందించే ప్రక్రియను చేపట్టారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవటంతో పాటు నీరు కూడా వృథా అవుతోన్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు.