హైదరాబాద్

త్వరలో జీహెచ్‌ఎంసీకి కొత్త చట్టం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపాలిటీలకు రూపకల్పన చేసిన సరికొత్త చట్టానికి గురువారం అసెంబ్లీ ఆమోదించింది. జీహెచ్‌ఎంసీ మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వర్తించేలా ఈ చట్టాన్ని రూపకల్పన చేయటంతో త్వరలోనే జీహెచ్‌ఎంసీకి కూడా సరికొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చే అవకాశామున్నట్లు కొందరు అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల చట్టం రూపకల్పన సమయంలోనూ ఉన్నత స్థాయి సమావేశాలకు హాజరైన కొందరు అధికారులు సైతం త్వరలోనే జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించి సరికొత్త చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, గురువారం అసెంబ్లీ ఆమోదించిన మున్సిపల్ చట్టం నుంచి జీహెచ్‌ఎంసీకి మినహాయింపునిచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు. మున్సిపాలిటీల్లోని ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో రోజురోజుకీ అవినీతి పెరిగిపోతుందని, దీన్ని అడ్డుకునేందుకు కఠినమైన చట్టాలు తీసుకురానున్నట్లు ఇప్పటికే పలు సార్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మున్సిపల్ చట్టంలో భవన నిర్మాణాల అనుమతులు, లేఔట్ల ఆమోదం వంటి అంశాలకు సంబంధించి ప్లానింగ్ విభాగానికి ఉన్న అధికారులకు కత్తెర పెట్టారు. ప్లానింగ్‌కు ఉన్న అధికారాలను కలెక్టర్లకు, ఇంజనీర్లు, నీటిపారుదల శాఖకు బదిలీ చేయటంతో త్వరలో తెరపైకి రానున్న జీహెచ్‌ఎంసీ చట్టంలో కూడా ఇదే తరహాలో అధికారాలకు కత్తెర పెడుతారనే చర్చ లేకపోలేదు.
రూపాయికే నిర్మాణ అనుమతి
సరికొత్త మున్సిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో 75 చదరపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణంలో రెసిడెన్షియల్ భవనాలను నిర్మాణ అనుమతులు అవసరం లేదని, వంద మీటర్ల కంటే ఎక్కువ స్థల విస్తీర్ణంలో ఇళ్లు కట్టుకునే వారికి కేవలం ఒక్క రూపాయి ఫీజుతో భవన నిర్మాణ అనుమతిని మంజూరు చేయాలని సరికొత్త చట్టంలో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి మొత్తం పట్టణ ప్రాంతం, కొంత అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ప్రభుత్వం 60 గజాల స్థలానికి పట్టాలు జారీ చేస్తున్నందున, రూపాయికే అనుమతి అనే నిబంధనను జీహెచ్‌ఎంసీ పరిధిలో 60 గజాలకు కుదించవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మున్సిపాలిటీల సరికొత్త చట్టం అక్రమ నిర్మాణాలు, అనుమతుల ఉల్లంఘనలను గణనీయంగా తగ్గించేలా నిబంధనలను పొందుపర్చారు. కానీ, అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి నోటీసు జారీ చేయకుండా నేరుగా కూల్చేసే నిబంధన కొత్త చట్టం ద్వారా అమల్లోకి రానుంది. అనుమతుల ఉల్లంఘన, ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే యజమాని, అనుమతి కోసం లైజనింగ్ చేసిన ఆర్కిటెక్చర్‌తో సహా అనుమతి ఇచ్చిన అధికారిని కూడా కఠినంగా శిక్షించాలని కొత్త చట్టం పేర్కొంటున్న మాదిరిగానే జీహెచ్‌ఎంసీలో కూడా ఇదే తరహా నిబంధన రావచ్చునని భావిస్తున్నారు. ఇదివరకున్న నిబంధన ప్రకారం అనుమతులు తీసుకున్న రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలు పది శాతం డీవియేషన్‌తో సరిగ్గా మంజూరు చేసిన ప్లాన్ ప్రకారమే నిర్మించారా లేదో అనే విషయాన్ని నిర్దారించుకున్న తర్వాతే అక్యుపెన్సీ సర్ట్ఫికెట్ జారీ చేసేవారు, కానీ, సరికొత్త చట్టం ప్రకారం నిర్మాణం మొత్తం నిబంధనల ప్రకారమే, తీసుకున్న అనుమతిని అనుసరించి నిర్మించానని యజమాని సెల్ఫ్ సర్ట్ఫికేషన్ చేసుకునేలా ప్రత్యేక సిస్టమ్‌ను కొత్త చట్టంతో మున్సిపాలిటీల్లో ప్రవేశపెట్టారు.
పర్మిషన్లు సరళీకృతం..
ఉల్లంఘనలపై కఠిన చర్యలు
మున్సిపాలిటీల పరిధిలోని నిర్మాణ అనుమతుల ప్రక్రియకు సంబంధించి పదిరోజుల్లో అనుమతి గురించిన సమాచారం దరఖాస్తుదారుడికి తెలియజేసి, 21 రోజుల్లో అనుమతులివ్వాల్సి ఉంటుంది. లిఖిత పూర్వకంగా యజమాని ఇచ్చే సెల్ఫ్ సర్ట్ఫికేషన్‌లో సమాచారం తప్పుగా పేర్కొన్నట్టు తేలితే యజమానిని, ఆర్కిటెక్చర్‌కు మొత్తం భవనం విలువలో 20 శాతం జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్షణ పడేలా సరికొత్త చట్టం పేర్కొంటుంది. ఇందుకు ఏర్పాటు చేసే టాస్క్ఫోర్సు, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందంలో ప్లానింగ్ అధికారుల నియామక ప్రస్తావన చట్టంలో లేదు. ఇదే తరహా నిబంధనల్లో మార్పులు చేసి, జీహెచ్‌ఎంసీకి సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.