హైదరాబాద్

ఆశ్లీల వెబ్‌సైట్లు నిలిపివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్జ : దేశంలో తక్షణమే అశ్లీల వెబ్‌సైట్లను మూసివేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పోటు కళావతి, ప్రధానకార్యదర్శి ఉస్తెల సృజన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ జ్యోతి పేర్కొన్నారు. మహిళల, పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై , పసిపిల్లలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయని, దీనికి కారణం అశ్లీల వెబ్‌సైట్లేనని అన్నారు. అలాగే మద్యం మత్తులో కూడా దాడులు జరుగుతున్నాయని, మద్యాన్ని నిషేధించాలని పేర్కొన్నారు. అశ్లీల వెబ్‌సైట్లను కూడా నిషేధించాలని సూచించారు. టీవీ సీరియల్‌లో హింసా ప్రవృత్తిన్న సీరియళ్లను నిషేధించాలని, మహిళలను కించపరిచే విధంగా చూపెడుతున్నారని వాటిని సెన్సార్ బోర్డు నియంత్రించాలని సూచించారు. ఫాస్టు ట్రాక్ ద్వారా శిక్షలు పడితే అత్యాచారాలను కొంత వరకూ అరికట్టవచ్చని డిమాండ్ చేశారు. షీ టీమ్స్ మండలాల వారీ నియమించాలని, మహిళా చట్టాలను పటిష్టపరిచి మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు ఎన్ ఛాయాదేవి, జే లక్ష్మీ, జీ వరమ్మ, గ్యార యాదమ్మ, మంగ, పీ సింధూరి, ఎన్ అక్షయ, మణెమ్మ, సత్యలక్ష్మి, హైమావతి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారని సృజన చెప్పారు.