హైదరాబాద్

ఇనాక్‌కు జీవిత సాఫల్య పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ డా.కొలకలూరి ఇనాక్, సతీరాజు శంకర నారాయణకు సృజన జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం సృజన కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ పాల్గొని జీవిత సాఫల్య పురస్కారాలతో పాటు ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేశారు. సజృన సంస్థ గత 26 సంవత్సరాలుగా అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. లయన్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి సమజానికి తనవంతు సహయ, సహకారం చేస్తున్నాని వివరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కళ పత్రిక ఎడిటర్ మహ్మద్ రఫీ, సంస్థ చైర్మన్ అంజనా చౌదరి పాల్గొన్నారు.

పైడి లక్ష్మయ్య, పీఎల్ సంజీవ రెడ్డి సేవలు మరువలేనివి
కాచిగూడ, జూన్ 25: డా.పైడి లక్ష్మయ్య, డా.పీఎల్ సంజీవ రెడ్డి సేవలు మరువలేనివని పలువురు వక్తలు అన్నారు. డా.పైడి లక్ష్మయ్య, డా. పీఎల్ సంజీవయ్య స్మారక ప్రతిభా పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం రసమయి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోశయ్య పాల్గొని ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య రవ్వా శ్రీహరి, ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీ్ధర్, సుప్రసిద్ధ రచయిత్రి డీ.కామేశ్వరి, ప్రముఖ పౌరాణిక పద్య నాటక కళాకారుడు ఏ.వేంకటేశ్వర రావుకు పురస్కారాలను ప్రదానం చేశారు. పైడీ లక్ష్మయ్య, డా.పీఎల్ సంజీవ రెడ్డి పేరిట రసమయి సంస్థ ఇప్పటి వరకు 121 మందికి పురస్కారాలను ప్రదానం చేశారని తెలిపారు. వేంకటేశ్వర రావు నిర్వహణలో ‘శ్రీకృష్ణార్జూనుల సంవాద ఘట్టం’ పద్య నాటకం ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్, మాజీ డీజీపీ డా. ఆర్.ప్రభాకర రావు, కళారత్న అవార్డు గ్రహీత ఎంకే ఆర్ ఆశాలత, సంస్థ అధ్యక్షుడు డా.ఎంకే రాము పాల్గొన్నారు.