హైదరాబాద్

బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: దేశ చరిత్రలోనే చారిత్రాత్మక బిల్లుగా నిలిచిపోనున్న బీసీ బిల్లుకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్ధుతు ఇచ్చి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మంగళవారం సోమాజిగడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి యువ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నిల వెంకటేష్ అధ్యక్షత వహించగా, సమన్వయకర్తగా గజ్జకృష్ణ వ్యవహరించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్దించి 71 ఏళ్లు గడిచినా చట్టసభల్లో ఆశించిన స్థాయిలో బీసీలకు ప్రాతినిధ్యం దక్కలేదని అన్నారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉండగా 16 రాష్ట్రాల నుంచి ఒక బీసీ ఎంపీ లేడని, ఇక దేశం మొత్తంలో 2600 బీసీ కులాలు ఉండగా 2,550 కులాలు పార్లమెంట్‌లో అడుగు పెట్టలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవుచ్చనన్నారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో తగిన రిజర్వేషన్లు కల్పించాలని గత 30 ఏళ్లుగా పోరాటాలు సాగిస్తున్నట్టు చెప్పారు. బీసీ బిల్లు పాస్ అవుతుందని ఆశిస్తున్నామని, పాస్ కాకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ కులాసంఘాల నాయకులు ఎల్.మల్లయ్య, వెంకటేష్, వెంటచారి, శ్రీనివాస్ పాల్గొన్నారు.