హైదరాబాద్

టీఎజీఓయు జలమండలి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : తెలంగాణ గెజిటేడ్ అధికారుల యూనియన్ (టీజీఓయు)కు అనుబంధంగా జలమండలి కమిటీ ఏర్పాటైంది. జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జలమండలి కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎం.మహేష్ కుమార్, కార్యదర్శిగా రజనీకాంత్, ఉపాధ్యక్షుడిగా కే.నాగారాజు వర్మ, బ్రిల్విన్ భాను, ఎం.సంతోష్ కుమార్, జాయింట్ సెక్రటరిగా టీ.అజయ్ సింగ్, ఎస్.నవీన్ కుమార్, అంకిత్ భాతగార్, కోశాధికారిగా పీ.్భరత్ కుమార్, పబ్లిసిటీ కార్యదర్శిగా అశ్విన్ కుమార్, అర్గనైజింగ్ కార్యదర్శిగా బీ.వెంకటేష్, కమిటీ మెంబర్లుగా బాలసుబ్రహ్మణ్యం, కే.శ్రీదేవి, ఎం.అనీష్ గౌడ్, గోపి కృష్ణ, కే.విజయ్ సాగ్‌ర్‌తో పాటు పలువురిని ఎన్జీవో సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్‌గా ఒమర్ ఖాన్ వ్యవహరించారు. నూతన కమిటీ 2019 నుంచి 2022 వరకు కొనసాగుతుంది. మహేష్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని చెప్పారు.
వ్యవసాయ వర్సిటీ,
పీఆర్‌డీఐఎస్‌ల మధ్య ఒప్పందం
రాజేంద్రనగర్, మే 25: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన పార్టిసిపేటరీ రూరల్ డెవలెప్‌మెంట్ ఇనిషియేటివ్స్ సొసైటీ మధ్య శుక్రవారం సాయంత్రం అవగాహన ఒప్పందం కుదిరింది. ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్‌రావు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్, పీ ఆర్‌డి ఐ ఎస్ ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.వెంకురెడ్డి సంతకాలు చేశారు.కార్యక్రమంలో పీఆర్‌డీఐఎస్ సలహదారు డాక్టర్ ఎంఎన్‌రెడ్డి, విశ్వవిద్యాలయ అంతర్జాతీయ కార్యక్రమాల డైరెక్టర్ డాక్టర్ ఆనంద్‌సింగ్, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
టాసా సర్వసభ్య సమావేశం
రాజేంద్రనగర్, మే 25: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని తెలంగాణ అగ్రికల్చరల్ సైంటిస్ట్ అసోసియేషన్ (టాసా) సర్వసభ్య సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం సెమినార్‌హాల్‌లో టాసా అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్ అధ్యక్షనత జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా యూనివర్సిటీ టీచింగ్ స్ట్ఫాకు కూడా హెల్త్‌కార్డులు అందజేయాలని తీర్మానించారు. యూనివర్సిటీ టీచర్స్‌కు వేతన సవరణను వెంటనే అమలు చేయాలని కోరుతూ తీర్మాణం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడిచిన వెంటనే వేతన సవరణ అమలు చేసేలా ప్రభుత్వంపై వత్తిడి తేవాలని కోరారు. అలాగే టాసాకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్రంలోని పలు కళాశాలలు, పరిశోధనా కేంద్రాల నుంచి ఈ సమావేశానికి శాస్తవ్రేత్తలు హాజరయ్యారు. సమావేశంలో కార్యదర్శి డాక్టర్ దామోదర్‌రాజు, కోశాధికారి డాక్టర్ శ్రీనివాసచారి పాల్గొన్నారు.