హైదరాబాద్

ఆకట్టుకున్న ‘సుందరకాండ ప్రవచనాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో శ్రీమాన్ రామానుజదాస స్వామిచే ‘సుందరకాండ ప్రవచనములు’ రెండోరోజు రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుపాల్గొని ప్రసంగించారు. ఆధ్యాత్మికతను పెంచడానికి ప్రవచనములు ఉపయోగపడతాయమని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు సుందరకాండ ప్రవచనములు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శ్రీమాన్ రామానుజదాస స్వామి నిర్వహించిన ‘సుందరకాండ ప్రవచనములు’ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు, మరుమాముల వెంకట రమణ శర్మ పాల్గొన్నారు.
మెగా మ్యూజికల్ షో పోస్టర్ ఆవిష్కరణ
ఖైరతాబాద్, ఏప్రిల్ 23: నెలలు నిండకుండా జన్మించిన చిన్నారుల సహాయార్థం ఈనెల 27, 28 తేదీల్లో నగరంలో మ్యూజికల్ షోను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు రవీంద్రన్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను శ్రీనివాస్, విఘ్నేష్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇలాంటి మరణాలు పేద కుటుంబాల్లో అధికంగా ఉంటున్నాయని తెలిపారు. ఇలాంటి చిన్నారులను బ్రతికించుకునేందుకు హీల్ ఏ చైల్డ్ సంస్థ పనిచేస్తుందని చెప్పారు. చేయూత నిచ్చేందుకు క్రియేటివ్ బడ్స్, కానె్సప్షనల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మ్యూజికల్ షోను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగే కార్యక్రమానికి ప్రముఖ సింగర్స్ శ్రేయా గోషల్, కలోనియల్ కజిన్స్, హరిహరన్ హాజరు అవుతున్నట్టు తెలిపారు.