హైదరాబాద్

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : భాగ్యనగరంలో శుక్రవారం ఆధ్యాత్మిక వెల్లివిరిసింది. ఒకే రోజు హనుమాన్ జయంతి, గుడ్‌ఫ్రైడే కావటంతో పాటు పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన ప్రజల సామూహిక ప్రార్థనల సందర్భంగా నగరం నలుమూలల ఆధ్యాత్మిక వెల్లివిరిసింది. హనుమాన్ జయంతిని, మరో వైపు గుడ్ ఫ్రైడే సందర్భంగా పార్థనలు జరుపుకోగా, ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం మక్కామసీదులో సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగించేందుకు పోలీసులు రచించిన వ్యూహాం ఫలించింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని లక్డీకాపూల్, హనునామ్ టేక్డీ, నాంపల్లి, సికిందరాబాద్ తాడ్‌బండ్‌తో పాటు శివార్లలోని పలు ప్రాంతాల్లోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అంతేగాక, ఈసారి అన్ని దేవాలయాలు, కాలనీ, యువజన సంఘాల ఆధ్వర్యంలో కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి మధ్యాహ్నాం, సాయంత్రం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. మరికొన్ని దేవాలయాల్లో శుక్రవారం సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే హనుమాన్ శోభయాత్ర ఈసారి కూడా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. హనుమాన్ శోభాయాత్ర జరిగిన గౌలీగూడ రాంమందిరం నుంచి సికిందరాబాద్ తాడ్‌బండ్ ఆంజనేయస్వామి దేవాలయం వరకు సుమారు 12 కిలోమీటర్ల పొడువున వివిధ ప్రాంతాలన్నీ జైశ్రీరాం.. జైభజరంగ్‌బలీ నినాదాలతో మారుమోగాయి. శోభాయాత్రకే పదివేల మంది పోలీసులు, 450 సీసీ కెమెరాలతో నిఘా, 20 ప్లాటూన్ల పారా మిలిటరీ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పాతబస్తీలోని చార్మినార్‌లోని శ్రీ్భగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి భక్తుల పోటెత్తటం, పక్కనే ఉన్న మక్కా మసీదులో మధ్యాహ్నం ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించటంతో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ముందస్తుగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

హైదరాబాద్, : శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భాగ్యనగర వీధులన్నీ కాషాయమంగా మారాయి. ఉదయం గౌలీగూడ శ్రీరామ మందిరం నుంచి ప్రారంభమైన శోభయాత్ర సుమారు 12 కిలోమీటర్ల పొడువున ఆద్యంతం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా, భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరిగింది. జై శ్రీరామ్.. జై బజరంగ్ భలి.. జై భారత్ నినాదాలతో పురవీధులు పులకించిపోయాయి. యాత్ర జరిగిన దారి పొడువున వేలాది మంది యువకులు కాషాయపు జెండాను చేత బూని తన భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. గంటల సేపు, పనె్నండు కిలోమీటర్ల పొడువున సాగిన యాత్రలో భాగంగా అడుగడుగున పలు ధార్మిక, యువజన, సంక్షేమ సంఘాలు ప్రత్యేక స్వాగత వేదికలను ఏర్పాటు చేసి యాత్రకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీసీతారాములు, లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శోభాయాత్రకు ఎలాంటి ఆటాంకాలు కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్‌ను మళ్లిస్తూ, పలు కుడాళ్లలో బారికెడ్లను ఏర్పాటు చేశారు. సిటీ పోలీసు విభాగానికి చెందిన 8000 మంది పోలీసులతో పాటు 20 ప్లాటున్లకు చెందిన పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. సెక్టర్ల వారీగా అదనపు పోలీసు కమిషనర్ల తోపాటు డీసీపీ, ఏసీపీలు శాంతిభద్రతలను పర్యవేక్షించారు. గౌలిగూడ హనుమాన్ మందిరం నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్‌లోని వీరాంజనేయ దేవాలయం వరకు శోభాయాత్ర ప్రశాంతంగా కన్నుల పండువగా కొనసాగింది. హనుమాన్ శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో దాదాపు 450 ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కదలికలను నగర పోలీస్ కమిషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసు అధికారులు ఎప్పటికపుడు పరిశీలించి అక్కడనున్న పోలీసులకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి సూచనలు ఇచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు ఇతర పోలీస్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక ర్యాలీలు గౌలిగూడలోని హనుమాన్ దేవాలయానికి చేరుకున్నాయి. శోభాయాత్ర ప్రారంభానికి ముందు హనుమాన్ దేవాలయంలో నగర పోలీసు కమిషనర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు గౌలిగూడ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమయిన హనుమాన్ శోభాయాత్ర పూత్లీబౌలి, ఆంధ్రాబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠీ, తిలక్‌పార్క్, సుల్తాన్‌బజార్, రాంకోఠీ, కాచిగూడ క్రాస్‌రోడ్స్, నారాయణగూడా, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా గాంధీనగర్, ప్రాగాటూల్స్ కవాడిగూడ, బన్సీలాల్‌పేట్, బైబిల్ హౌస్, బాటా షోరూం, సుభాష్ రోడ్డు, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ, చర్మాస్, ప్యారడైజ్ క్రాస్‌రోడ్డు, ఇంపీరియల్ గార్డెన్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగింది. శోభాయాత్ర సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఒకే రోజు గుడ్ ఫ్రైడే, హనుమాన్ జయంతి, ముస్లింల ప్రార్థనలు రావడంతో శాంతిభద్రతలను ఎప్పటికపడు పర్యవేక్షించామని సీపీ పేర్కొన్నారు. శోభాయాత్ర సందర్భంగా ర్యాలీని సీపీతో పాటు అదనపు పోలీసు కమిషనర్లు చౌహన్, అనిల్ కుమార్, మూరళీ కృష్ణతో పాటు డీసీపీ, ఏసీపీలు బందోబస్తులో పాల్గొన్నారు. శోభాయాత్ర సందర్భంగా చిక్కడపల్లి, ప్రగాటూల్స్, రాణింగంజ్ తదితర ప్రాంతాల్లో స్థానికులు ప్రత్యేక స్టేజీలు ఏర్పాటు చేసి ర్యాలీకి స్వాగతం పలికారు.
పాతబస్తీలో
శ్రీహనుమాన్ జయంతి వేడుకలు పాతబస్తీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో హనుమాన్ దేవాలయాలు కిటకిటాలాడాయి.
అలియాబాద్ ఫూల్‌బాగ్ లక్ష్మీనగర్ రెసెడిన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్యక్షడు ఎస్.వెంకట్ మోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో లక్ష్మినగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌లు కే.శ్రీనివాస్, వీ.రాజు, ప్రధాన కార్యదర్శి ఎస్.శైలేష్ కుమార్‌తో పాటు ఆరవింద్ కుమార్, ఠాకుర్ రాకేష్ సింగ్ పాల్గొన్నారు.