హైదరాబాద్

భగభగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంపై ప్రచంఢ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. గత కొద్దిరోజులుగా నగరంలో వేడి, ఉక్కపోత పెరిగినా, సాయంత్రం నాలుగు గంటల నుంచి వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురిసేవి. కానీ సోమవారం నగరంలో ఏకంగా పగటి గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల పై చిలుకు నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం నుంచే 36, 38 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత గరిష్టంగా 40 డిగ్రీలకు చేరింది. ఈ ఉష్ణోగ్రతలు మున్ముందు మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉదయం ఎనిమిది గంటల నుంచే నగరంలో ఎండ మండుతూ, పనె్నండు గంటల కల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ కారణంగా మధ్యాహ్నం పనె్నండున్నర గంటల తర్వాత రద్దీగా ఉండే మెయిన్‌రోడ్లలో కూడా వాహనాలు, పాదచారుల రాకపోకలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఉదయం నుంచే వేడిగాలులు వీయటంతో మధ్యాహ్నం ఉక్కపోత రెట్టింపవుతోంది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని, పర్యావరణ నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో బయటకు రావల్సిన వారు పలు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారిలో వాహనదారులు ముఖానికి ముసుగు, మాస్క్‌లు, తలకు క్యాప్‌లను ధరించి దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాల మార్గాలను అనే్వషిస్తున్నారు. నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, పీపుల్స్‌ప్లాజా, నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్, చార్మినార్ వంటి ప్రాంతాల్లో శీతల పానీయాల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగటంతో నగరంలో ఎయిర్ కండీషన్, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. ఎండాకాలం రాకముందు కేవలం రూ. రెండున్నర వేల వరకు ఖరీదు చేసే మినీ సైజు కూలర్ ఇపుడు ఐదున్నర వేల నుంచి ఆరు వేల రూపాయల మధ్య అమ్ముడుపోతోంది. మధ్య తరగతి ప్రజలు కూడా వాయిదా పద్ధతిన ఎయిర్ కండీషన్లు కొనుగోలు చేస్తున్నారు.