హైదరాబాద్

నిరంతరం నిఘా.. ప్రత్యేక పర్యవేక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్‌కు చాలా సమయం ఉన్నందున, నగరంలో ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలోని ఈవీఎంల భద్రతపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీటిలో నిక్షిప్తమై ఉన్న ప్రజాతీర్పుకు ప్రతి సెంటర్‌లోనూ మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం ఇరవై నాలుగు గంటల పాటు నిరంతర నిఘా ఉండేలా ఈ దళాలు పహారా కాస్తున్నాయి. ఒక్కో డీఆర్‌సీ కేంద్రం చుట్టూ, కేంద్రం లోపల భాగంలోనే గాక, ఈవీఎంలను భద్రతపరిచిన ప్రతి స్ట్రాంగ్ రూం వద్ద రౌండ్ ది క్లాక్ సాయుధ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. నగరంలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను వేర్వేరుగా భద్రపరిచిన అన్ని కేంద్రాల బయట సీసీ కెమెరాలను కూడా అమర్చి, భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును పారామిలిటరీ అధికారులు, స్థానిక పోలీసులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేగాక, డీఆర్‌సీ కేంద్రాలన్నీ కూడా నిత్యం రద్దీగా ఉండే మాసాబ్‌ట్యాంక్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, కోఠి, బషీర్‌బాగ్ వంటి ప్రాంతాల్లోని మెయిన్ రోడ్లలోనే ఉండటంతో రాత్రి పూట నిఘాను మరింత ముమ్మరం చేస్తున్నారు. అంతేగాక, ఈ కేంద్రాల ముందు నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనాలు, వ్యక్తులను చిత్రీకరించేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు ఇంకా సుమారు 39 రోజుల సమయం ఉన్నందున ఇక్కడ మూడు అంచెలుగా నాలుగు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించే పారా మిలిటరీ దళాలకు కేంద్రం ఆవరణలోనే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ దళాల్లోని ఒక్కో సాయుధ పోలీసు సుమారు ఆరు గంటల పాటు, ఇలా రోజుకి నాలుగు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించేందుకు వీలుగా వారికి సౌకర్యాలను కల్పించారు. ఈ కేంద్రాలను సందర్శించేందుకు ఎన్నికల సంఘం, పోలీసు ఇతర ఏ శాఖకు చెందిన ఉన్నతాధికారులు వచ్చినా, తప్పకుండా వారి పూర్తి వివరాలను నమోదు చేసుకుంటూ, ఆ ప్రక్రియను కూడా సీసీ కెమెరా ద్వారా చిత్రీకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా మరిన్ని దశల్లో జరగనున్న పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చే నెల 23వ తేదీన నిర్వహించే కౌంటింగ్ కూడా కాస్త ముందుగానే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకుగాను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను బట్టి, టేబుళ్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.