హైదరాబాద్

ప్రచారంపై డేగ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల సమర్పణ సోమవారంతో ముగిసింది. ఇక అభ్యర్థులు ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటుంటే, ఎన్నికల అధికారులు కూడా అభ్యర్థుల వ్యయం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో డేగ కన్ను వేయనున్నారు. ఇందుకు ఇప్పటికే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, అభ్యర్థుల క్షేత్ర స్థాయి ప్రచార తీరు, చేస్తున్న వ్యయాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు అభ్యర్థి ప్రచారాన్ని ప్రారంభించే సమయం నుంచి రాత్రి ముగించే వరకు అభ్యర్థిని షాడోలే వెంటాడే విధంగా ఈ బృందాలు పనిచేయనున్నాయి. ఎన్నికల సంఘం ఇదివరకు అమలు చేసిన నిబంధనల ప్రకారం అభ్యర్థుల తమ ఎన్నికల వ్యయానికి సంబంధించి ఎప్పటికపుడు స్థానిక ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉండేది. కానీ ఇపుడు అభ్యర్థి చేస్తున్న వ్యయాన్ని ఎప్పటికపుడు క్షేత్ర స్థాయిలో అంచనా వేసేందుకు ప్రత్యేకంగా బృందాలు రంగంలో దిగనున్నాయి. ప్రచారం చేసే అభ్యర్థి ప్రచారంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేస్తున్నారా? లేక ఉల్లంఘిస్తున్నారా? అన్న విషయంతో పాటు ప్రచారానికి వినియోగిస్తున్న సామాగ్రి, మందీ మార్బలం, హంగూ, ఆర్భాటం, వినియోగించే వాహనాల సంఖ్య, వాటి ఇంధనం వంటివి మొత్తాన్ని వీడియో చిత్రీకరించి, సదరు అభ్యర్థి చేసిన ఖర్చును అంచనా వేసి, ఆయన ఖాతాలో జమా చేసే విధంగా ఈ బృందాలను నియమించారు. ఒక్కో రకమైన ఖర్చుకు రేట్లను నిర్ణయించేందుకు వేర్వేరుగా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో నియమించే అధికారులు, సిబ్బందికి, అభ్యర్థికి గానీ ఎలాంటి సంబంధాలు గానీ, పరిచయాలు గానీ లేకుండా, ఏర్పడకుండా ఎప్పటికపుడు ప్రాంతాలను మారుస్తూ ఈ నిఘాను కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సికిందరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారంతో పాటు పార్టీలు అభ్యర్థికి మద్దతుగా నిర్వహించే ప్రచారంపై కూడా ఎన్నికల సంఘం నిఘా పెట్టనుంది.

దాహార్తిని తీర్చడం అభినందనీయం
ఖైరతాబాద్, మార్చి 25: మండువేసవిలో దాహంతో ఉన్న వారికి గొంతు తడిపేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని నిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిమ్స్ ప్రధాన ద్వారం వద్ద మంచుకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంచుకొండ ప్రకాశంతో కలిసి ప్రారంభించారు. మాట్లాడుతూ నిత్యం వేలల్లో వచ్చే నిమ్స్ ఆసుపత్రి వద్ద చలివేంద్రం ఏర్పాటు రోగులు వారి సహాయకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. గత నాలుగేళ్లుగా తమ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకాశం తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు రవికుమార్, సురేందర్ ప్రతినిధి శ్రావణ్ పాల్గొన్నారు.