హైదరాబాద్

గాయకుడు మోహన్‌కు బిరుదు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రముఖ గాయకుడు కళ్ళేపల్లి మోహన్‌కు ‘స్వరసమ్మోహన్’ బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం సుజారమణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు పాల్గొని బిరుదును ప్రదానం చేశారు. ప్రముఖ గాయనీ సుజాత నిర్వహణలో గాయనీ, గాయకులు టీవీ రావు, నాగరాజారావు, మారుతీ రావు, లలితా రావు, వసంత, దమయంతి, విమల అలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో లయన్ విజయ్ కుమార్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, యలవర్తి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
3న ‘హరికథ సప్తాహం’
కాచిగూడ, మార్చి 25: శ్రీత్యాగరాయ గానసభ మాజీ అధ్యక్షుడు కళా వేంకట దీక్షితులు జయంతి సందర్భంగా శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేది నుంచి ఏప్రిల్ 3వ తేది వరకు ‘హరికథ సప్తాహం’ నిర్వహిస్తున్నట్లు శ్రీత్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి తెలిపారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన హరికథలు, హరికథా భాగవతారిణిలు ప్రతినిత్యం మూడు గంటల పాటు హరికథలు వినిపిస్తారని వివరించారు. హరికథ చెప్పిన కళాకారులను సత్కారించుకుంటామని తెలిపారు.తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని హరికథ సప్తాహం ప్రారంభిస్తారని అన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే హరికథలను ప్రముఖులు పాల్గొంటారని వివరించారు. హరికథ సప్తాహం కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విలేఖరుల సమావేశంలో గానసభ కార్యవర్గ సభ్యులు బండి శ్రీనివాస్, శ్రీలతా వర్మ, దత్తు పాల్గొన్నారు.
తెలుగు సాహిత్యంలో అగ్రగణ్యుడు
దివాకర్ల తిరుపతి శాస్ర్తీ
కాచిగూడ, మార్చి 25: తెలుగు సాహిత్యంలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధి పొందిన ఆధునిక కవి దివాకర్ల తిరుపతి శాస్ర్తీ అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. కళ్యాణవీణ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి పండితుడు దివాకర్ల తిరుపతి శాస్ర్తీ జయంతి సభ సోమవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వకుళాభరకణం కృష్ణమోహన రావు విచ్చేసి దివాకర్ల తిరుపతి శాస్ర్తీ చిత్ర పటానికి నివాళి అర్పించారు. తిరుపతి శాస్ర్తీ గొప్ప కవిగా, పండితుడిగా, అవధానిగా తెలుగు సాహితీ లోకంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. తిరుపతి శాస్ర్తీ రచనలలో ‘మృచ్ఛకటికం, ప్రభావతీ, ప్రద్యుమం, బుద్ధ చరితం, దేవి భాగవతం’ రచనలు ఎంతో కీర్తి తెచ్చియని తెలిపారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, గాయకుడు కళ్యాణ్ కోటం రాజు, ప్రవీణ పాల్గొన్నారు.