హైదరాబాద్

పాతబస్తీలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాతబస్తీలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఫలక్‌నుమ సబ్ డివిజన్ ఏసీపీ మహ్మద్ అబ్దుల్ రషీద్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఫలక్‌నుమ సబ్ డివిజన్‌లోని ఛత్రినాక పోలీసు స్టేషన్ పరిధిలోని ఫలక్‌నుమా రోడ్డు, జంగమ్మెట్ మార్కెట్, జంగమ్మెట్, వార్డు ఆఫీసు, ఖాద్రి చమాన్, రిసాలా ప్లేగ్రౌండ్, రవీంద్ర నాయక్‌నగర్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి పోలీసు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌లో ఏసీపీ మహ్మద్ అబ్దుల్ రషీద్, ఛత్రినాక ఇన్‌స్పెక్టర్లు ఆర్.విద్యాసాగర్ రెడ్డి క్రైమ్ ఇన్‌స్పెక్టర్ నవీన్‌తో పాటు సిబ్బంది, ఆర్‌ఎఎస్‌ఎఫ్ 101 బెటాలియన్ ఫోర్సు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పోలీసు బందోబస్తును ముమ్మరం చేశామని, వాహనాల తనిఖీలను కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. యువ ఓటర్లు కూడా నిర్భయంగా ముందుకు వచ్చి ఓటు వేయాలని సూచించారు. ఫలక్‌నుమ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను సందర్శించి, ఎన్నికలకు సంబంధించిన సున్నిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పికెట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫ్లాగ్ మార్చ్‌లో పాల్గొన్న ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రినాక పోలీస్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టామని చెప్పారు. ప్రతి రోజు బందోబస్తుపై రివ్యూలు నిర్వహిస్తున్నామని, అనుమానం కలిగిన వ్యక్తులు తమ ప్రాంతాల్లో సంచరించిన వారిపై దృష్టి సారించినట్టు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.