హైదరాబాద్

22, 23 తేదీల్లో మోగా రక్తదాన శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 22, 23 తేదీల్లో హైదరాబాద్ నగరంలో మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్టు రోటరి క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు కిరణ్ పటేల్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్ల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. 1905లో ప్రారంభమైన రోటరి క్లబ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగుల సహాయార్థం మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 22న ది ప్లాజా హోటల్‌లో డిస్ట్రిక్ట్ గవర్నర్ రమేష్ వంగాల ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. 23న నగరంలోని 14 ప్రాంతాల్లో శిబిరాలు కొనసాగుతాయని, వెయ్యి యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసేమియా బాదితులకు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో శశికళ, శ్రీనిధి, నరేష్ పాల్గొన్నారు.