హైదరాబాద్

నిబంధనలపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో సొంతిల్లు నిర్మించుకునేందుకు, కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్ నిర్మించాలనుకునే వారికి టౌన్‌ప్లానింగ్ నిర్మాణ నిబంధనలపై అవగాహన లేకపోవటంతో మధ్యవర్తులు, దళారీలను ఆశ్రయిస్తున్నారు. ఈ రకమైన వ్యవహారానికి చెక్ పెట్టి, నేరుగా దరఖాస్తుదారులే తమ వద్ద నుంచి నిర్మాణ అనుమతులు తీసుకునేందుకు వీలుగా నిబంధనలపై అవగాహన పెంచేందుకు బల్దియా సిద్ధమైంది. నిర్మాణ నియమ, నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు దేశంలోనే మొట్టమొదటి సారిగా జీహెచ్‌ఎంసీ ఈ నెల 23వ తేదీన ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. 23న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే సదస్సుకు 500 గజాల్లోపు స్థలంలో ఇళ్లను నిర్మించుకోవాలనుకునే వారు, రెండు వేల చదరపు అడుగుల్లోపు ఫ్లాట్‌లు కొనుగోలు చేయాలనుకునే వారు హాజరుకావచ్చునని కమిషనర్ సూచించారు. 550 గజాల్లోపు స్థలంలో ఇళ్లను నిర్మించుకోవాలనుకునే వారికి సదస్సులో అవసరమైన ప్లాన్‌లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. నిర్మాణ నియమ నిబంధనలకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచి, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు కమిషననర్ నేరుగా దరఖాస్తుదారులతో ముఖాముఖీ నిర్వహించనున్నారు. ఇందులో నిర్మాణ అనుమతి కోరే దరఖాస్తుదారుడు ఏ విధమైన డాక్యుమెంట్లు సమర్పించాలి, ఎంత వరకు సెట్‌బ్యాక్ వదలాలి, ఫ్లాట్ కొనుగోలు సందర్భంగా జీహెచ్‌ఎంసీ విధించిన నిబంధనలు ఏమిటీ? ఎన్ని గజాల స్థలంలో జీహెచ్‌ఎంసీ ఎన్ని అంతస్తులకు అనుమతిస్తుంది? సర్కిల్, జోన్, ప్రధాన కార్యాలయాల పరిధుల్లో ఎన్ని అంతస్తుల అనుమతులిస్తున్నారా? అనే అంశంపై ప్రజల్లో అవగాహన పెంపొందించనున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించనున్న సదస్సులో జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణ నిబంధనలు, అనుమతుల కోసం దరఖాస్తుల సమర్పణ, వాటి పరిశీలన, క్షేత్ర స్థాయి తనిఖీలు, కావల్సిన డాక్యుమెంట్లు వంటి అంశాలకు సంబంధించి సదస్సులో ప్రజెంటేషన్ ఉంటుందని కమిషనర్ వివరించారు. సదస్సుకు సంబంధించిన అదనపు వివరాల కోసం ఫోన్ నెం.లు 7993360230, 040-23220438ను సంప్రదించవచ్చునని సూచించారు.
ఏడాదికి 16వేల పైచిలుకు అనుమతులు
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో వివిధ క్యాటగిరీలకు సంబంధించి ఏడాదికి సుమారు 16వేల పైచిలుకు అనుమతులను జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో దాదాపు 13వేల దరఖాస్తులు వ్యక్తిగత నివాసాలకు సంబంధించి అనుమతులను కోరుతున్నట్లు వివరించారు. ఇప్పటికే డీపీఎంఎస్ విధానంతో ఆన్‌లైన్‌లో అనుమతులను జారీ చేస్తున్నా, దరఖాస్తుదారుల్లో అవగాహన లోపం, నియమ నిబంధనలను తెలిపే ప్రత్యేక వ్యవస్థ లేకపోవటంతో దాదాపు పది శాతంపైగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నట్లు తెలిపారు. ఇలాంటి దరఖాస్తులను సమర్పించిన వారు బల్దియా ఆఫీసుల చుట్టూ తిరగటం, మధ్యవర్తులు, దళారీలను ఆశ్రయించటంతో అక్రమ నిర్మాణాలు వెలిసేందుకు కారణమవుతున్నట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపారు.