హైదరాబాద్

అక్రమ కట్టడాల కూల్చివేతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్న జలమండలి ఎండీ, బల్దియా కమిషనర్ దాన కిషోర్ గురువారం పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. యాకుత్‌పురా నియోజకవర్గంలో సీవరేజీ, తాగునీటి సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరా వేళలు కూడా అనుకూలంగా ఉన్నాయా లేదా అనే అంశంపై ఆరా తీశారు. యాకుత్‌పుర రైల్వే బ్రిడ్జి దగ్గర ఉన్న నాలాను ఆనుకుని పైప్‌లైన్ పనులకు పలు అక్రమ నిర్మాణాలు అడ్డంగా ఉన్నట్లు గుర్తించిన కమిషనర్.. జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు పరస్పరం సమన్వయంతో వాటిని వెంటనే కూల్చివేసి, 600 ఎం మంచినీటి సరఫరాను విస్తరించాలని ఆదేశించారు. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతి, పనుల్లో నాణ్యత అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నాలా పూడికతీత పనులు, రిటైనింగ్ వాల్ నిర్మాణం, పలు ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. డబర్‌పురా నాలా, గంగానగర్ నాలా, మాతాకీ కిడికీ నాలా, రిటైనింగ్ వాల్ నిర్మాణం, యాకుత్‌పురా రైల్వే స్టేషన్ నాలాల్లో జరుగుతున్న పూడికతీత పనులను కమిషనర్ పరిశీలించారు. మరికొన్ని ప్రాంతాల్లో పూడికతీత పనులు జరగకపోవటానికి కారణాలను అడిగి తెల్సుకున్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే పాషాఖాద్రి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు వాజిద్ అలీఖాన్, మీర్జా రియాజ్ ఉల్ సహన్ ఉన్నారు.