హైదరాబాద్

అసలు ‘లీక్’ అక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అనే చందంగా మారింది గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి బిల్లుల జారీ ప్రక్రియ. కోట్ల రూపాయలు వెచ్చించి జలమండలి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తోంది. జలమండలి వినియోగదారుల నుంచి రెండు విధాలుగా కమర్షియల్, డోమెస్టిక్‌ల కింద నీటి బిల్లులను వసూలు చేస్తోంది. మరి కొన్ని ప్రాంతాల్లో బల్క్ రూపంలో కమర్షియల్, డోమెస్టిక్ క్యాటగిరీలుగా విభజించి బిల్లులు జారీ చేస్తోంది. మీటర్ రీడర్లు, వాటర్ లైన్‌మెన్‌లు ఇంటింటికీ తిరిగి నీటి బిల్లులను వినియోగదారులకు అందజేసేవారు. అందులో భాగంగా జలమండలి రెవెన్యూ విభాగం ఉన్నతాధికారులు.. జలమండలిలో మీటర్ రీడర్లు, బిల్ కలెక్టర్లు కాలక్రమేనా తగ్గిపోవడంతో నీటి బిల్లుల జారీ ప్రక్రియను ఏజెన్సీలకు అప్పగించింది. మొదట్లో కేవలం హైదరాబాలోని 15 నియోజకవర్గాలకు చెందిన ప్రాంతాలకే పరిమితమైన జలమండలిలో నగర శివార్లలోని 13 మున్సిపాలిటీలను విలీనం చేయడంతో జలమండలి పరిధి విస్తరించిందించి. నగరంలోని 15 నియోజకవర్గాలతో పాటు కూకట్‌పల్లి, ఎల్‌బినగర్, కుత్భుల్లాపూర్, అల్వాల్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, కాప్రా, చందానగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ కలిపి మెయింటనెన్స్ విభాగానికి సంబంధించి డివిజన్‌లను ఏర్పాటు చేశారు. జలమండలి పరిధిలో మొత్తం 967803 నీటి కనెక్షన్లు ఉన్నాయి. జలమండలి పరిధిలో ఉన్న నీటి కనెక్షన్లకు ప్రతి నెల నీటి బిల్లులు జారీ చేసేందుకు రెవెన్యూ విభాగం కొంత మంది ఏజెన్సీలను ఎంపిక చేసింది. దీంతో నీటి బిల్లులు జారీ చేసే ఏజెన్సీలు నియమించే మీటర్ రీడర్‌లు, బిల్ కలెక్టర్లు.. ఇంటింటికీ తిరిగి బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది. ఆయా ఏజెన్సీలకు చెందిన ఫీల్డ్ సిబ్బంది.. నల్లా కనెక్షన్‌కు ఉన్న నీటి మీటర్‌ను చూసి నీటి బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది. ఏజెన్సీలకు చెందిన సిబ్బంది ఇష్టం వచ్చిన్నట్లు నీటి బిల్లులు జారీ చేస్తున్నారు. దీంతో జలమండలి ఆదాయానికి భారీగా గండి పడుతోందని గుర్తించిన అధికారులు అత్యవసరంగా ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఏజెన్సీలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏజెన్సీలకు సంబంధించిన బిల్లులు పంపిణీ చేసే సిబ్బంది తప్పకుండా ఇంటింటికీ వెళ్లి నీటి కనెక్షన్‌కు సంబంధించిన మీటర్‌ను పరిశీలించి బిల్లులు జారీ చేయాల్సి ఉంటుందని సూచించింది. బిల్లులు జారీ చేస్తున్న ఇంటికి సంబంధించిన కనెక్షన్ డోమెస్టికా లేదా కమర్షియల్ అనే విషయాన్ని కూడా ఏజెన్సీకి చెందిన సిబ్బంది జలమండలి అధికారులకు తెలియాజేయాల్సి ఉంటుంది. నీటి బిల్లుల జారీ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సంబంధిత ఏజెన్సీని బ్లాక్‌లిస్టులో పెట్టి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు జలమండలి రెవెన్యూ విభాగం అధికారులు సిద్ధమయ్యారు. ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇకపై ప్రతినెలా నీటి కనెక్షన్ కలిగిన వినియోగదారుడికి తప్పకుండా మీటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఫోన్ నెంబర్లకు ఎస్‌ఎంఎస్‌లతో సమాచారం అందించనున్నారు. వినియోగదారుడి చెల్లించాల్సిన నీటి బిల్లుల సమాచారంతో పాటు నీటి మీటర్‌ను కూడా తప్పకుండా కలిగి ఉండాలని ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌తో పూర్తి సమాచారాన్ని అందించేందుకు రూపకల్పన చేస్తోంది. నీటి బిల్లులకు సంబింధించి పూర్తి స్థాయిలో ఏజెన్సీలు నీటి బిల్లులు జారీ చేయలేకపోతున్నాయి. వంద శాతం నీటి బిల్లులను జారీ చేయాలన్నదే జలమండలి రెనెన్యూ విభాగం ప్రధాన ఉద్ధేశ్యం. నీటి కనెక్షన్ కలిగిన వినియోగదారుడు.. మీటర్ ఏర్పాటు చేసుకోకుంటే రెట్టింపు చార్జీలు వసులు చేసేందుకు జలమండలి సిద్ధమవుతోంది.