హైదరాబాద్

సూర్య నమస్కారాలతో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉదయాన్నే సూర్య నమస్కారాలతో ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. సూర్యనమస్కారాలు చేయడంతో శరీరంలోని 638 కండరాలకు శక్తి వస్తుంది. సూర్య నమస్కారాలను 12 భంగిమల్లో చేస్తారు. పవిత్రమైన రథ సప్తమిని పురస్కరించుకుని మంగళవారం సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము ‘హిరణ్యయేన సవితారథేన’ అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనం, దక్షాణాయనం అని రెండు విధములు. ఆషాడమాసం నుంచి పుష్యమాసం వరకు దక్షిణాయనం, సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే మంగళవారం పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. సూర్య నమస్కారం అనేది, యోగాసనాలలో ముఖ్యమైనది. ఈ యోగాసనాన్ని ప్రతి రోజు చేయడంతో అన్ని రకాలుగా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఇందులో ఉండే ప్రతి దశ నిర్దిష్ట లక్ష్యాన్ని కలిగి ఉండి, ఆచరించే పద్దతుల్లో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. దీంతో యోగాసానలలో సూర్యనమస్కారం ఆసనానికి విశేష ఆదరణ పొందింది. మన పూర్వీకులు అచరించే పద్దతుల్లో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. రథసప్తమి పురస్కరించుకుని ప్రశాంత్‌నగర్ టెంపుల్ అల్వాల్‌లోని నిర్మలా యోగ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 6.00 గంటల నుంచి 7.00 గంటల వరకు బొల్లారంలోని కంటోన్మెంట్ పార్కులో దాదాపు 200 మంది సాధకులతో కంటోన్మెంట్ పార్కులో 108 సూర్యనమస్కారాలను యోగ శిక్షకురాలు ఆర్‌ఎస్ నిర్మల చేయంచారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు అరవింద్ రేఖా, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిని బిందు, సచివాలయం ఉద్యోగి కానుకుంట్ల స్వామి, శేషు, అరవింద్ రెడ్డి పాల్గొన్నారు.