హైదరాబాద్

పరిశోధనలపై దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: సాహిత్య విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణాచారి అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శతాధిక గ్రంథకర్త డాక్టర్ కపిలవాయి లింగమూర్తి జీవితం సాహిత్య సమాలోచన జాతీయ సదస్సు మంగళవారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రమణచారి మాట్లాడుతూ నేటి యువ రచయితలకు ఆదర్శప్రాయుడని అన్నారు. యువత లోతైన పరిశోధనలు చేయడం ద్వారా కపిలవాయి లింగమూర్తి సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహద పడుతుందని తెలిపారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి, కార్యదర్శి ఏనుగు నరసింహా రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్, నిజాం కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఎల్‌బీ లక్ష్మీకాంత్ రాథోడ్, ప్రముఖ సాహితీవేత్త శ్రీరంగాచార్య పాల్గొన్నారు.
ఘంటసాల పురస్కారం ప్రదానం
కాచిగూడ, ఫిబ్రవరి 12: పద్మశ్రీ ఘంటసాల 45వ వర్థంతి సందర్భంగా ‘ఘంటసాల పురస్కారాలు’ ప్రదానోత్సవ కార్యక్రమం అర్చన కల్చరల్ అసోసియేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి పాల్గొని గాయనీ టీవీ లలితారావుకు ఘంటసాల పురస్కారం ప్రదానం చేశారు. ప్రముఖ గాయకుడు అర్చన వెంకటేశ్వర రావు నిర్వహణలో గాయనీ, గాయకులు అఖిల, జయశ్రీ, మనస్వీని, పద్మప్రియ, రాధిక, లలిత, మోహన్, టీవీ రావు, శ్రీనివాస శర్మ అలపించిన సినీ గీతాలు అలరించాయి.
‘జీవీఆర్ ఆరాధన - కేవీ రమణ’
ఎక్సలెన్సీ అవార్డులు ప్రదానం
కాచిగూడ, ఫిబ్రవరి 12: ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి జన్మదినోత్సం సందర్భంగా ‘జీవీఆర్ ఆరాధన - డా.కేవీ రమణ’ ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ మాజీ చెర్మన్ డా.ఏ.చక్రపాణి పాల్గొని వివిధ రంగంలో విశిష్ట సేవలందించినవారికి ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేశారు. లయన్ డా.చిల్లా రాజశేఖర రెడ్డి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో కళ పత్రిక సంపాదకుడు మహ్మద్ రఫీ, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, కళాపోషకుడు లయన్ పీ.జయప్రకాష్ రెడ్డి, అల్పనా చౌదరి, పద్మశ్రీ లత, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గుదిబండి వెంకట రెడ్డి, వీవీ రాఘవ రెడ్డి పాల్గొన్నారు.