తెలంగాణ

కాజీపేట డివిజన్ మాటే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైల్వే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకూ మొండిచెయ్యే చూపించింది. కాజీపేటను రైల్వే డివిజన్‌గా చేయాలన్నది చిరకాల డిమాండ్. ఈసారి బడ్జెట్‌లో ఈమేరకు ప్రకటన చేస్తారని భావించినా నిరాశే ఎదురైంది. ఇక కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై టిఆర్‌ఎస్ ఎంపిలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రం నుంచి ఎంపిలు పంపిన ప్రతిపాదనల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకే ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్రం గతంలో వరంగల్ జిల్లా కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసింది. కానీ ఏర్పాటు కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కంటి తుడుపు చర్యగా కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదనను సజీవంగా ఉంచేందుకు బడ్జెట్‌లో వెయ్యి రూపాయలు కేటాయించారు. ఈ సారి కోచ్ ఫ్యాక్టరీపై ఆశలు వదులుకోమని చెబుతున్నట్టుగా ఎలాంటి కేటాయింపులు జరపలేదు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ మూడేళ్లలో పూర్తి చేయనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. ఈసారి కాకపోయినా మూడేళ్ల తరువాతైనా కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తారనే ఆశలకు అవకాశం లేకుండా బడ్జెట్‌లో కోచ్ ఫ్యాక్టరీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. యాదాద్రి వరకూ ఎంఎంటిఎస్ పొడిగింపునకు బడ్జెట్‌లో ఆమోదం వ్యక్తం చేసినా, నిధుల కేటాయింపు జరగలేదు. యాదాద్రి వరకూ లైన్ నిర్మాణానికయ్యే ఖర్చులో సగం కేంద్రం భరిస్తే మిగతా సగం భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నమంటూ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ మేరకు ఈ లైన్ మంజూరైనట్టు తెలుస్తోంది. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్‌కు 70 కోట్ల రూపాయలు కేటాయించడం కాస్త ఊరట కలిగించే విషయం. మంచిర్యాల నుంచి ముంబైకి, న్యూఢిల్లీ, ఆహ్మదాబాద్ ఈశాన్య రాష్ట్రాలకు కొత్త రైళ్లు వేయాలని ఎంపిలు కోరారు. ఆదిలాబాద్ రైల్వేలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, కనెక్టివిటీ పెంచాలని కోరారు. రైల్వే లైన్ పొడిగిస్తే దేశంలోనే మంచి టూరిజం కేంద్రంగా ఆదిలాబాద్ నిలుస్తుందని ఆ జిల్లా ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని కోరారు.
తీరు మారింది: కవిత
ఏ రాష్టన్రికి చెందిన వారు రైల్వే మంత్రిగా ఉంటే ఆ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం మామూలని, కానీ ఈసారి పరిస్థితి మారిందని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. వౌలిక సదుపాయాలకు కేటాయింపులు బాగున్నాయని అన్నారు. స్ర్తిల భద్రత కోసం తీసుకున్న చర్యలు బాగున్నాయని అన్నారు.