తెలంగాణ

క్రమం తప్పింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రమబద్ధీకరణ గడువు సాగుతూనే ఉందిగానీ, ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. సిఎం హామీలు సైతం నెరవేరక పోవడంతో మధ్య తరగతి ప్రజల్లో ఒకింత అసంతృప్తి నెలకొంటోంది.

హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాసాలు ఏర్పర్చుకున్న మధ్యతరగతి ప్రజానీకానికి వాటిపై హక్కులు కల్పించి, క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన జీవో 59 ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చందంగా మారింది. జీవో జారీ చేసి 15 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఖరారు చేసిన మొతాన్ని చెల్లించిన వారికి కూడా ఇంతవరకు క్రమబద్ధీకరణ జరగలేదు. జీవో 59 కింద పూర్తిగా డబ్బు చెల్లించిన వారికి సంక్రాంతి పండుగ నాటికి క్రమబద్ధీకరించి పట్టా పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అయినా ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. ఆక్రమిత స్థలాలకు డబ్బులు చెల్లించడానికి ఐదు వాయిదాలలో చెల్లించడానికి ఇచ్చిన గడువుకూడా డిసెంబర్ 2015 నాటికి ముగిసింది. జీవో 59 కింద ఆక్రమిత స్థల విస్తీర్ణం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువలో 25, 50, 75 శాతాల లెక్కన చెల్లించడానికి ప్రభుత్వం మూడు రకాలుగా వర్గీకరించింది. 125 చదరపుగజాల వరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారు దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలు అయిన పక్షంలో ఉచితంగా క్రమబద్ధీకరించడానికి మరో జీవో 58ని విడుదల చేసింది. అయితే పేదలు కాని పక్షంలో 2014, జూన్ 2 (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం) నాటి సదరు భూమి రిజిస్ట్రేషన్ విలువలో 10 శాతాన్ని వసూలు చేసి క్రమబద్ధీకరించడం, అంతకుమించి ఉంటే 125 నుంచి 250 చదరపు గజాల వరకు 25 శాతం, 250 నుంచి 500 గజాల వరకు 50 శాతం, 500 నుంచి 1000 చదరపు గజాల వరకు 75 శాతం మొత్తాన్ని చెల్లించిన పక్షంలో క్రమబద్ధీకరించనున్నట్టు జీవో 59లో పేర్కొంది. అలాగే జీవో 58 కింద ఉచిత క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులలో నిబంధనల మేరకు ఉచిత క్రమబద్ధీకరణ పరిధిలోకి రాని వాటిని జీవో 59 కింద బదలాయించింది. ఇలా జీవో 58 నుంచి జీవో 59 కిందకు బదలాయించిన దరఖాస్తుల సంఖ్య 21,493. కాగా జీవో 59 కింద క్రమబద్ధీకరణ కోసం నేరుగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య 23,516. జీవో 59 కింద దరఖాస్తులతోపాటు వచ్చిన మొత్తం రూ.129.30 కోట్లు. వీటిపై గడువు ముగిసేనాటికి అంతిమంగా అందినది రూ. 141.35 కోట్లు మాత్రమే. ఇందులో ఏకమొత్తంలో ప్రభుత్వం ఖరారు చేసిన మేరకు పూర్తిగా చెల్లించి వారి సంఖ్య 409 మంది. వీటినుంచి ప్రభుత్వానికి వచ్చిన సొమ్ము రూ.కోటి 70 లక్షలు. ఐదు విడతలకు కలిపి అంతిమంగా దాదాపు రూ. 1000 కోట్ల మేరకు ఆదాయం సమకూరనుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఐదు వాయిదాల్లో చెల్లించడానికి ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు గడువుకూడా గత డిసెంబర్‌లోనే ముగిసింది. వాయిదాల పద్ధతిలో చెల్లించిన వారి మాట అటుంచి కొందరు దరఖాస్తుదారులు ఏకమొత్తంగా చెల్లించి 14 నెలలు గడస్తున్నా వారికి కూడా నేటి వరకు క్రమబద్ధీకరణ జరుగలేదు. రెవిన్యూశాఖ నిర్లక్ష్యం వల్ల తలతాకట్టు పెట్టి క్రమబద్ధీకరణకు ముందుకు వచ్చినప్పటికీ ఈ ప్రక్రియ ఇప్పటిదాకా పూర్తి కాకపోవడం పట్ల దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించడం ద్వారా ప్రభుత్వానికి ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేకపోయింది. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరించడం ద్వారా రూ. 1000 కోట్ల ఆదాయం వస్తుందని గత ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసినా మళ్లీ బడ్జెట్ వచ్చే నాటికి కూడా లక్ష్యాన్ని సాధించడంలో రెవిన్యూశాఖ వైఫల్యం చెందింది.