తెలంగాణ

సైబరాబాద్ పోలీసులపై అసోంలో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసోంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులపై గురువారం ఆన్‌లైన్ లాటరీ ముఠా కాల్పులకు తెగబడింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు గౌహతి వెళ్లారు. అక్కడ పల్టాన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంటర్‌నెట్ కేఫ్‌ల్లో సోదాలు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా కొందరు దుండగులు కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే దుండగుల కాల్పులనుంచి సైబరాబాద్ పోలీసులు తప్పించుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శుక్రవారం హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్టు సైబరాబాద్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. పట్టుబడిన నిందితులు విపుల్ అలీ, భాస్కర్ చక్రవర్తిగా పోలీసులు గుర్తించారు. వీరు కొంతకాలంగా హైదరాబాద్‌లో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.