జాతీయ వార్తలు

గగనతలం నుంచి ఢిల్లీకి ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రతా ఏజన్సీలను అప్రమత్తం చేసిన హోంశాఖ

న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశ రాజధాని న్యూఢిల్లీకి కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సహా వివిధ ఉగ్రవాద ముఠాలనుంచి వైమానిక దాడుల ముప్పు ఉందని హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇలాంటి దాడులను తిప్పి కొట్టడానికి అవసరమైన చర్యలను భద్రతా ఏజన్సీలు తీసుకోవడంతో పాటుగా, దాడులు జరిగే అవకాశమున్న 15 కీలక ప్రాంతాలను సైతం గుర్తించాయి. దాడులు జరపడానికి ద్రోణ్‌లు, మానవరహిత వైమానిక వ్యవస్థలు (యుఎఎస్), పారా మోటార్లు లాంటివి ఉపయోగించవచ్చని కూడా హోం మంత్రిత్వ శాఖ అంటోంది. భారత వైమానిక దళం స్నేహ పూర్వకమైనవి కాదని ప్రకటించిన వెంటనే అనుమానాస్పదంగా కనిపించిన ఆకాశంలో ఎగిరే ఏ వస్తువునైనా కూల్చివేయాలని మంత్రిత్వ శాఖ భద్రతా ఏజన్సీలను ఆదేశించడాన్ని బట్టి ముప్పు ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాడులను తిప్పి కొట్టడానికి అవసరమైన సూచనలు చేయాల్సిందిగా నార్త్‌బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీసు, సిఐఎస్‌ఎఫ్, కేంద్ర పౌర విమానయాన శాఖ, భారత వైమానికదళాన్ని కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దాడులు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రధాని కార్యాలయం, రాష్టప్రతి భవన్, హోంమంత్రి, ఉప రాష్టప్రతి నివాసాలు, రాజ్‌పథ్, ఇండియా గేట్ చుట్టూ ఉన్న ప్రాంతాలతో పాటుగా సిబిఐ, సిఐఎస్‌ఎఫ్, బిఎస్‌ఎఫ్ లాంటి కీలక ఏజన్సీల ప్రధాన కార్యాలయాలున్న సిజిఓ కాంప్లెక్స్ ఉన్నాయని హోంశాఖ తెలిపింది. ‘్ఢల్లీ దేశంలోనే అత్యంత సున్నితమైన మెట్రో నగరం. వివిధ ఉగ్రవాద సంస్థల నుంచి అది బెదిరింపులను ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు ప్రధానంగా వైమానిక దాడుల ముప్పులపై దృష్టి కేంద్రీకరించాం. ఢిల్లీలో ఇలాంటి దాడులు జరిగే అవకాశాల గురించి భద్రతా, ఇంటెలిజన్స్ ఏజన్సీలకు నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ ముప్పును తిప్పి కొట్టడానికి ప్రభుత్వం ఒక వ్యూహాన్ని సైతం రూపొందించింది’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.