క్రీడాభూమి

హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ జర్మనీ-భారత్ మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, నవంబర్ 28: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) ఫైనల్స్ టోర్నమెంట్‌లో శనివారం భారత్, జర్మనీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయ. ఒలింపిక్ చాంపియన్ జర్మనీకే ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు అభిప్రాయపడ్డారు. అయతే, భారత ఆటగాళ్లు సమష్టిగా కృషి చే యడంతో డ్రా సాధ్యమైంది. మ్యాచ్ ఆరో నిమిషంలోనే జర్మనీకి నిక్లాస్ వీలర్ ద్వారా గోల్ లభించింది. దీనితో ఆ జట్టు గోల్స్ వేటను మనుకొని, భారత ఆటగాళ్లను నిలువరించేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయతే, 47వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ అత్యంత కీలకమైన గోల్ చేశాడు. ఈక్వెలైజర్ లభించిన తర్వాత భారత్ కూడా డిఫెన్స్‌కు దిగింది. దీనితో పూల్ ‘బి’లో జరిగిన ఈ మ్యాచ్ డ్రా అయంది. ఇలావుంటే, ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ జట్లు విజయాలతో టోర్నమెంట్‌ను ఆరంభంచాయ. ఆసీస్ 1-0 తేడాతో బెల్జియంను ఓడించింది. జెమీ డ్వెయర్ ఈ గోల్ చేశాడు. కాగా, బ్రిటన్ 3-1 తేడాతో కెనడాపై విజయం సాధించింది. (చిత్రం) ఆకాశ్‌దీప్ సింగ్