క్రైమ్ కథ

కనబడుట లేదు (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన నా మొదటి క్లైంట్.
‘మిస్టర్ టర్న్‌బకల్! మీరు నిత్యం ఓ రిపోర్ట్‌ని పంపాలి. అందుకు రోజుకి ఏభై డాలర్ల చొప్పున ఇస్తాను. అంగీకారమేనా?’ ఆయన అడిగాడు.
అది తక్కువ అనిపించి చెప్పాను.
‘ఏభై డాలర్లు ప్లస్ ఖర్చులు ఐతే ఓకే’
‘ఖర్చులు ఉంటాయనుకోను. రోజుకి ఏభై డాలర్ల చొప్పున ముప్పై రోజులకి ముప్పై రిపోర్టులని పంపాలి’
‘ఇరవై లేక ముప్పై ఏళ్ల క్రితం అపరాధ పరిశోధనకి రోజుకి ఏభై డాలర్లు సమంజసం. కాని నేడు...’
ఆయన ఆపమన్నట్లుగా చేతిని ఎత్తి చెప్పాడు.
‘మీరు అందుకోసం మీ ఆఫీస్ వదిలి బయటకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ టైప్‌రైటర్ ముందు కూర్చుని మీ లెటర్ హెడ్ మీద రిపోర్ట్‌లని టైప్ చేసి పంపితే చాలు. అలా ముప్పై రిపోర్టులని పంపండి’
అంతకు ముందు ఆయన నాకు చెప్పిన పేరుని రాసుకున్న కాగితం వంక చూశాను. పౌలా స్మిత్ అనే పేరు కనిపించింది.
‘అంటే నేను నిజంగా పౌలా స్మిత్ అనే ఆమెని కనుక్కోవాల్సిన అవసరం లేదా?’ ప్రశ్నించాను.
‘అవును. మీరు ఆమె కోసం వెతకాల్సిన అవసరం లేదు. కాని బాగా వెతికినట్లుగా రిపోర్ట్‌లో రాస్తే చాలు. అందుకు మీ ఊహాశక్తిని ఉపయోగించండి. కాగితం మీద శాన్‌ఫ్రేన్సిస్కో షికాగో ఇలా దేశంలోని అనేక ప్రదేశాలకి వెళ్లి, చివరికి ఆమె దొరకలేదని ఆఖరి రిపోర్టులో రాయండి’
‘మీరు లెటర్‌హెడ్‌ని అచ్చువేసి వాటిని రాసుకుంటే ఇంకా చవక అవుతుందిగా?’ ప్రశ్నించాను.
‘నిజమే. కాని అపరాధ పరిశోధన పద్ధతులు కాని, ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీలు ఉపయోగించే పదజాలం కాని నాకు తెలీదు. అవి సక్రమంగా ఉండాలి. పైగా మీ ఏజెన్సీ ఎడ్రస్ గల కవర్ని కూడా ముద్రించాల్సి ఉంటుంది’
నా క్లైంట్ వయసు ఏభై పైనే. నుదుటికి అటు, ఇటు జుట్టు తెల్లబడింది. ఖరీదైన దుస్తులు వేసుకున్న ఆయన తన పేరు చెప్పడానికి నిరాకరించాడు.
‘పౌలా స్మిత్ ఆమె అసలు పేరేనా?’ అడిగాను.
‘అవును’
‘కనపడని పౌలా స్మిత్‌ని వెతకమని మీరు నన్ను కోరుతున్నారు. నేను ఆమెని కనుక్కోవడం మీకు ఇష్టం లేదు. అవునా?’
మా సంభాషణ సారాన్ని ఆయన ముందు ఉంచాను.
‘అవును’
‘మీరు పోలీసులకి ఆమె గురించి రిపోర్టు ఇచ్చారా?’ ప్రశ్నించాను.
‘పౌలా స్మిత్ ఆనందంగా ఉంది. బానే ఉంది. అంతకు మించి మీరు ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ముప్పై రిపోర్టులని తయారుచేయడానికి మీకు ఎంతకాలం పడుతుంది?’
‘సుమారు వారం రోజులు. వివిధ నగరాల్లోని వీధులు, రెస్టారెంట్స్, హోటల్స్ పేర్లు తెలుసుకోడానికి లైబ్రరీకి వెళ్లాల్సి ఉంటుంది.
పౌలా స్మిత్‌ని ఆఖరిసారి ఎక్కడ చూశారు?’ ప్రశ్నించాను.
‘అది తెలుసుకోవాల్సిన అవసరం మీకేమిటి?’
‘ఆమెని ఆఖరిసారి సహారా ఎడారిలో చూస్తే నార్త్ పోల్‌లో పరిశోధనని ఆరంభించలేను కదా?’
ఆయన అర్థమైంది అన్నట్లుగా తల ఊపి చెప్పాడు.
‘మీ ఇంటి నించి ఆమె తన లగేజ్‌తో టేక్సీ తీసుకుని ఎయిర్‌పోర్ట్‌కో, బస్‌స్టాండ్‌కో వెళ్లిందని మీ రిపోర్టుని ఆరంభించండి. నా ఇంటి అడ్రస్‌తో ఆరంభించాల్సిన అవసరం లేదు’
తను వచ్చిన పని చెప్పింది.
‘పౌలా స్మిత్‌ని వెదకమని మా నాన్న మిమ్మల్ని నియమించారని తెలిసింది’
‘మీ నాన్న నాకో కేస్‌ని అప్పగించారు’ నేను అసలు విషయాన్ని పక్కన పెట్టి మృదువుగా చెప్పాను.
‘సరే. అందుకు ఆయన మీకు ఎంత ఇస్తున్నారో నాకు తెలీదు కాని మీరు ఆమెని కనుక్కోకపోతే రెట్టింపు ఇస్తాను’
నేనా మాటలని వినడం రెండోసారి.
‘ఆమెని ఎందుకు కనుక్కోవద్దని అడుగుతున్నారు?’
‘అది మీకు అనవసరం’
‘పౌలాస్మిత్‌ని నేను కనుక్కోకూడదు అనుకోడానికి కారణం ఆమె వెళ్లిపోవడానికి మీరు కొంత డబ్బిచ్చారు. బహుశ ఆమె ఇరవై వేల డాలర్లు అడిగి ఉంటుంది’
‘మీకు ఎలా తెలుసు?’ ఆశ్చర్యంగా అడిగింది.
‘అదే డిటెక్టివ్ పని. ఆమెకి డబ్బిచ్చి తిరిగి రావద్దని కోరడానికి కారణం, ఆమె మీ నాన్నని, మీ అన్నయ్యని పెళ్లితో బంధించకూడదని. అవునా?’
ఆమె ఆశ్చర్యంతో కొద్దిసేపు మాట్లాడలేకపోయింది.
‘మై డియర్ మిస్ బేంక్రాఫ్ట్. మీ నాన్న కాని, మీ అన్నయ్య కాని పౌలాని మళ్లీ చూడాలని కోరుకోవడం లేదు. నిజానికి కొద్ది గంటల క్రితం మీ అన్నయ్య పౌలాని నేను కనుక్కోకుండా ఉండడానికి మీ నాన్న ఇచ్చే మొత్తానికి మీలానే రెట్టింపు ఇస్తానని చెప్పాడు. మీ నాన్న కూడా కేవలం రిపోర్ట్‌లనే కోరారు తప్ప పౌలా ఎక్కడ ఉందో తెలుసుకో దలచుకోలేదు’
‘ఓ! పౌలాని వెనక్కి రప్పించే ఉద్దేశం లేనప్పుడు అసలు మా నాన్న అందుకు మిమ్మల్ని ఎందుకు నియమించారు?’ నిర్ఘాంతపోతూ అడిగింది.
‘నేను అనుకోవడం మీ అన్నయ్య పౌలాని పెళ్లి చేసుకుంటాడని మీ నాన్న నమ్మి ఉండచ్చు. ఒకవేళ మీ నాన్న కూడా ఆమెకి వెళ్లిపోవడానికి డబ్బిచ్చి ఉంటే నేను ఆశ్చర్యపోను. పౌలా వెళ్లిపోయిందని తెలిసాక జెరోమ్ ఆమెని కనుక్కోడానికి ప్రైవేట్ డిటెక్టివ్‌ని నియమిస్తాడని భావించి ఉంటాడు. దాన్ని ఆపడానికి మీ నాన్న నన్ను పౌలాని వెదక్కుండా వెదికినట్లుగా తప్పుడు రిపోర్ట్‌లని తయారుచేసి ఇవ్వమని ఉంటారు. ఇంతకంటే నాకు ఇంకో కారణం కనపడటంలేదు’
మేరియానా చిన్నగా నిట్టూర్చి చెప్పింది.
‘మేము ముగ్గురం కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవడం మంచిది అనిపిస్తోంది’
కొద్దిసేపాగి మళ్లీ నవ్వుతూ చెప్పింది.
‘మిస్టర్ హెన్రీ! మీరు ఎప్పటికీ ప్రైవేట్ డిటెక్టివ్‌గా ధనవంతులు కాలేరు’
‘అవుతాననే నేను ఈ వృత్తిలోకి దిగాను. ఏం?’ అడిగాను.
‘మీరు దాచకుండా ఉన్నది చెప్పేశారు కదా. ఇక మా నాన్నగారు చెల్లించే మొత్తానికి నేను కాని, మా అన్నయ్య కాని మీకు డబ్బు చెల్లించక్కర్లేదు. మా నాన్న కూడా ఇక రిపోర్ట్‌లని కోరాల్సిన అవసరం ఉండదు’
‘నిజమే. మీరు చెప్పేదాకా నాకు అది స్ఫురించలేదు. నాకు ఇంకో ఆలోచన వచ్చింది. నేను పౌలాని కనుక్కొంటానని, లేదా మీ కుటుంబ సభ్యులు కొంత సొమ్ము చెల్లించాలని బెదిరిస్తే?... ఊహూ. అది బ్లాక్‌మెయిల్ అవుతుంది’
‘నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. మా కుటుంబం మిమ్మల్ని ఉత్త చేతులతో పంపదు’
మేము ఆమె కారులో బేంక్రాఫ్ట్ ఇంటికి చేరుకునే సరికి ఆమె తండ్రి, అన్న ఇంట్లోనే ఉన్నారు. వాళ్లు నన్ను చూసి నిశే్చష్టులయ్యారు. జేమ్స్ లిక్కర్ కేబిన్ దగ్గర నిలబడి గ్లాసుల్లోకి డ్రింక్స్‌ని వంచుతున్నాడు.
‘ఇట్సాల్‌రైట్ నాన్నా...’ పౌలా స్మిత్ అందరి దగ్గరా ఇరవై వేలు తీసుకుని వెళ్లడం గురించి మేరియానా వివరించింది.
నేను తీవ్రంగా ఆలోచిస్తూంటే నాకోటి స్ఫురించింది. వెంటనే చెప్పాను.
‘పౌలా స్మిత్ మీకు సోమవారం ఉదయం వెళ్తానని చెప్పింది. కాని ఎందుకు ముందు రోజు రాత్రే వెళ్లింది?’
ఆ ముగ్గురూ నా ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయారు.
‘నేను అనుకోవడం ఆదివారం రాత్రి పది తర్వాత పౌలా స్మిత్ ఇక్కడ హత్య చేయబడింది. తర్వాత హంతకుడు ఆమె శవాన్ని ఇంట్లోంచి తీసుకెళ్లిపోయాడు’
‘ఆమె వెళ్లడానికి మనసు మార్చుకుందని, మాలోని ఒకరు చంపారని మీరు ఆరోపిస్తున్నారా?’ మేరియానా కోపంగా అడిగింది.
‘లేదు. ఆమె వెళ్లాలనే అనుకుని మీ ముగ్గురి నించి తలో ఇరవై వేలు పిండింది. మీ ముగ్గురిలో ఎవరికీ ఆమె ఉండటం ఇష్టం లేదు. మీ ముగ్గరికీ ఒకరి సంగతి మరొకరికి తెలిస్తే మీరు పోలీసులకి ఫిర్యాదు చేసి ఆ డబ్బు వెనక్కి కోరచ్చు. కాని స్వతంత్రంగా వెళ్లడానికి మునుపు ఆమె హత్య చేయబడింది. ఎందుకు? ఎవరి చేత? అన్నవి మనం సమాధానం తెలుసుకోవాల్సిన ప్రశ్నలు’
వారు నా వంక ప్రశ్నార్థకంగా చూశారు.
‘ఎందుకో స్పష్టమవుతుంది. ఆమె దగ్గర ఉన్న అరవై వేల డాలర్ల కోసం. అది ఎవరికి తెలుసు?’
‘నేను కాని, మా ఇంట్లోని ఎవరం కాని అంత చిన్న మొత్తం కోసం ఆమెని హత్య చేయం’ బేంక్రాఫ్ట్ ఆందోళనగా చెప్పాడు.
‘అవును. నేను కూడా పౌలాని నా చేతులతో గొంతు పిసికి చంపను’ జెరోమ్ చెప్పాడు.
‘ఆమె గొంతు పిసికి చంపబడిందని మీకు ఎలా తెలుసు?’ వెంటనే అడిగాను.
‘ఎందుకంటే ఎవరూ తుపాకీ పేలిన మోతని వినలేదు. ఎక్కడా రక్తం కనపడలేదు కాబట్టి కత్తిని కూడా ఉపయోగించి ఉండరు. చంపటమంటూ జరిగితే గొంతు నులిమి చంపబడాలి అనుకున్నాను’
‘మీది తెలివైన బుర్ర. పౌలాని హత్య చేసిన వ్యక్తికి ఆమె సోమవారం ఇంట్లోంచి వెళ్లిపోతోందని తెలుసు. హత్యని మరుగుపరచడానికి దాన్ని ఉపయోగించుకున్నాడు. చంపాక ఆమె శవాన్ని పడక గదిలోంచి కిందకి తీసుకువచ్చి కారులో ఉంచి, తిరిగి ఆమె గదిలోకి వెళ్లి రెండు సూట్‌కేస్‌లని తీసుకుని వాటిని కూడా కారులో ఉంచాడు. అల్మైరాలో ఆమె బట్టలు ఉన్నాయని అతనికి తెలీదు. పౌలా బరువైంది. ఆమెని ఎవరు కిందికి మోసుకురాగలరు? మీ తండ్రీ కొడుకుల్లో ఎవరైనా మోసుకురాగలరు. వీరిద్దరూ కాక వేరెవరు తేగలరు?’ ప్రశ్నించాను.
‘ఎవరు?’ మేరియానా అడిగింది.
‘తోటమాలి?’ ప్రశ్నించాను.
‘విక్టర్? ఆయన వయసు అరవై ఐదు. అరవై కిలోల బరువుని ఆయన మోయలేడు’
నేను తల ఊపి జేమ్స్ వంక చేత్తో చూపిస్తూ చెప్పాను.
‘ఇది నీ పనే జేమ్స్. పౌలా స్మిత్‌ని నువ్వే చంపావు?’
‘హత్యని బట్లర్ చేశాడంటారా?’ ఆల్బర్ట్ ఆశ్చర్యంగా అడిగాడు.
అతను నా వంక తీక్షణంగా చూస్తూ చెప్పాడు.
‘అది పూర్తిగా హాస్యాస్పదం సర్. ఆమె దగ్గర అరవై వేల డాలర్లు ఉన్నట్లు నాకు తెలీదు సర్’
‘మిస్ స్మిత్ ఆడది. ఏడాదిపాటు మీ ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. రాత్రి మీ ఇద్దరికీ ఈ పెద్ద ఇంట్లో మరుగు లభిస్తుంది. ఆమెది మగాడి అవసరం ఉన్న వయసు’
‘మీరు చెప్పేది అసంబద్ధంగా ఉంది సర్’ ఎర్రబడ్డ మొహంతో జేమ్స్ చెప్పాడు.
‘శవాన్ని ఏం చేసావు జేమ్స్? ఇంట్లో పాతావా? అది ప్రమాదం. తవ్వుతూంటే నిన్ను ఎవరైనా చూడచ్చు. దాన్ని నువ్వు దూరంగా తీసుకెళ్లి వదిలించుకుని ఉంటావు. సరస్సు? నది? ఊహు. శవం తేలుతుంది. దాన్ని ఎక్కడ పాతావు?’ అడిగాను.
కొంత నిశ్శబ్దం. మేరియా మెల్లిగా చెప్పింది.
‘హంతకుడు మెడోస్’
‘మెడోస్? అతను ఎవరు?’
‘నా డ్రైవర్. అతను గేరేజ్ మీది గదిలో ఉంటాడు’ ఆల్బర్ట్ చెప్పాడు.
‘పౌలా, మెడోస్‌లని ఒకే ఎంప్లాయిమెంట్ ఏజెన్సీ మా దగ్గరికి పంపింది’ మేరియానా చెప్పింది.
‘నేను అనేకసార్లు వాళ్లిద్దరూ ప్రేమికుల్లా మెలగడం చూశాను’ జేమ్స్ చెప్పాడు.
‘మెడోస్ వయసు పాతిక. పౌలా వయసు నలభై. ఐనా అలా కనపడదు. ఆ అరవై వేలతో వాళ్లిద్దరూ వెళ్లిపోవాలని అనుకున్నారు. మెడోస్ తను పని మానేస్తున్నానని నాతో చెప్పాడు. కాని అతనికి ఆమె మీద కంటే ఆమె డబ్బు మీదే ఆసక్తి ఉండి ఉండాలి’ ఆల్బర్ట్ చెప్పాడు.
‘మెడోస్ తన మిత్రుడి దగ్గరికి ఓ హంటింగ్ కేబిన్‌కి వెళ్లి గడిపేవాడు. పౌలాని పాతిపెట్టడానికి అది సరైన చోటు. చుట్టుపక్కల మైళ్ల దూరంలో ఇళ్లేమీ ఉండవని ఓసారి నాకు చెప్పాడు’ జేమ్స్ చెప్పాడు.
నేను వెంటనే నా మిత్రుడు రాల్ఫ్‌కి ఫోన్ చేసి నా అనుమానం చెప్పాను. అతను వచ్చి మెడోస్ గదిని వెదికితే కొన్ని ఆధారాలు దొరికాయి. రాల్ఫ్ ఇరవై నాలుగ్గంటల్లో మెడోస్‌ని, అతని దగ్గర ఉన్న అరవై వేల డాలర్లని స్వాధీనం చేసుకున్నాడు. పౌలా శవాన్ని, ఆమె రెండు సూట్‌కేస్‌లలని పాతిన చోటుని మెడోస్ చెప్పాడు.
నాకు బేంక్రాఫ్ట్ కుటుంబం నించి అందించింది కేవలం ఐదువందల డాలర్లే!

(జాక్ రిట్జ్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి