రాష్ట్రీయం

హైకోర్టు రిజిస్ట్రార్‌గా నాగార్జున నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా డి.నాగార్జునను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు జడ్జిగా పని చేస్తున్న నాగార్జునను హైకోర్టు రిజిస్ట్రార్‌గా బదిలీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

మాకూ న్యాయం చేయండి
హైకోర్టుకు అక్షయ గోల్డ్ వినియోగదారుల మొర
హైదరాబాద్, నవంబర్ 28: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసినట్టే తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎపి అక్షయ గోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం హైకోర్టును ఆశ్రయించింది. శనివారం ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు విఎస్‌ఎస్ పూర్ణచంద్రరావు పిల్‌ను దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీ మాదిరిగా అక్షయ గోల్డ్ గ్రూప్ కూడా అక్రమాలకు పాల్పడిందని తెలిపారు. అక్షయ సంస్థకు ఉన్న ఆస్తులను విక్రయించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు.