రాష్ట్రీయం

నిఘా వర్గాల హెచ్చరికలతో హైదరాబాద్‌లో హై-అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్ విమానాశ్రయంలో అదనపు బలగాల మోహరింపు
షాపింగ్ మాల్స్, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక నిఘా

హైదరాబాద్, నవంబర్ 23: ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో ఇటీవల నరమేథం సృష్టించిన ఉగ్రవాదులు మన దేశంలోనూ ఇటువంటి దాడులకు తెగబడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపి నగరంలో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముష్కరులు ఎటువంటి దాడులకైనా పాల్పడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్‌లు, మెట్రో, బస్టాండ్‌లలో ప్రత్యేక బలగాలను మోహరించారు.
అదేవిధంగా నగరంలోని ప్రముఖ ప్రార్థన మందిరాలు, ప్రధాన కూడళ్లు, షాపింగ్‌మాల్స్, హోటళ్లు, మార్కెట్ల వద్ద భద్రతను పెంచి ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసం ఉండే ప్రాంతాలతో పాటు జంట నగరాల్లోని వివిధ ప్రదేశాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నగరంలోని మహాత్మాగాంధీ బస్టేషన్, పికెట్‌లోని జూబ్లీ బస్టాండ్‌లలో పోలీసులు తనిఖీలను పెంచి అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు.
కొన్ని ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్‌లను కూడా అందుబాటులో ఉంచారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని పలు పిక్నిక్ స్పాట్‌లతోపాటు సైబరాబాద్‌లోని ఐటి కారిడార్‌లో సైతం భద్రతను ముమ్మరం చేశారు. అదేవిధంగా వరంగల్, కరీంనగర్ పట్టణాల్లోని ప్రధాన కార్యాలయాల వద్ద భద్రతను పెంచి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన రహదారులు, రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.