Others

ఏదీ... సినిమా దారి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు పాత్ర మార్చాం.
బడ్జెట్‌తో రాజీపడకుండా చిత్రం పూర్తి చేశాం.
నటీనటులంతా (కోట్లు తీసుకుని) పూర్తిగా సహకరించారు.
హీరోయిన్ తన పాత్రకు న్యాయం చేసింది.
ఈ నటి తప్ప ఈ పాత్రలో ఇంకెవరినీ ఊహించలేం.
చిత్రంలోని ఐదు పాటలూ అమృత గుళికలే.
అబ్బో సంగీతాన్ని వినాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం.
ఈ చిత్రం -హీరో జీవితానికి ఓ మైలురాయి

సినిమా ఫంక్షన్లలో రొటీన్‌గా వినిపిస్తున్న డైలాగులివి. సినీ అభిమానులకు ఇదీ ఓ ఎంటర్‌టైన్‌మెంట్. అట్టహాసాలు, ఊహాగానాలు, చిలుక జోశ్యాలు, ఊకదంపుడు మాటలు.. అన్నీ పూర్తి చేసుకొచ్చిన ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ‘్ఢమాల్’మంటుంది. దాదాపు మూడు నాలుగేళ్ల నుంచీ టాలీవుడ్‌లో -కనిపిస్తున్న చిత్రమైన సీన్ ఇది. పెద్దదైనా బడ్జెట్‌దైనా.. స్థాయికి తగిన ‘ఆడియో’ ఫంక్షన్‌ను ప్రతి సినిమా జరుపుకుంటుంది. ప్రమోషన్‌లో ఇది అనివార్యం అన్నట్టు -సంప్రదాయంగా మార్చేశారు కూడా. దర్శకుని తరపున, నటీనటుల తరపున, నిర్మాత తరపున పాతతరం, నేటితరం కళాకారులు ‘ఆడియో’కు రావడం... పిలిచారు కాబట్టి తప్పదన్నట్టు సెల్ఫ్ కొట్టడాన్ని చూడలేక చస్తున్నారు జనాలు. ఆవు కథల మాదిరిగా -వంశాల కీర్తన ఎలాగూ తప్పదు కనుక భరించాల్సిందే.
ఈ సినిమా చలనచిత్ర రంగంలో కొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయమంటూ ఆహూతులంతా ముఖస్తుతి మాట్లాడటం మామూలే. ఇక వారసుల చిత్రాల గురించి చిత్ర యూనిట్, పాతతరం నటీనటులు ఫంక్షన్లలో -అతిగా పొగడటం, ఆకాశానికి ఎత్తేయడంలాంటి వ్యవహారాలు శృతిమించుతున్నాయి. సినిమా డైలాగులను మించి ఆడియో ఫంక్షన్లలో పొగడ్తల డైలాగులు పేలుస్తుంటే -హాజరైన అభిమానగణం విజిల్స్ వేస్తున్నా చానెల్స్‌లో చూస్తున్న సినీజనం మాత్రం ఠక్కున టీవీ కట్టేస్తున్నారు. చిత్రం ఏంటంటే -ఆడియో డబ్బా ఎక్కువైన సినిమాలు అధికశాతం బాక్సాఫీస్ దగ్గర బొల్తాకొడుతున్నవే. సరుకులేని సినిమాలు ‘్ఫట్’మంటున్నా -టాలీవుడ్ మాత్రం ‘ఆడియో’ మంత్రం జపించడం మానడం లేదు. గొప్పగా ఫంక్షన్ నిర్వహించినంత మాత్రాన -సినిమా ఫేట్ మారిపోతుందా? చిత్రం విజయం సాధిస్తుందా? అంటే సున్నానే. మరెందుకీ ఆడియో ఫంక్షన్లు? చిత్రంలో సత్తావుంటే ఏ ఫంక్షన్ అవసరం లేదన్నది ఎందుకు తెలుసుకోరు.
టాలీవుడ్‌లో లెక్కకుమించి చిత్రాలొస్తున్నాయి. పట్టుమని వారంకూడా ఆడకుండానే -్థయేటర్లనుంచి వెళ్లిపోతున్నాయి. సినిమా ఖాళీ కావడానికి ఇతర కారణాలు మరెన్నైనా ఉండొచ్చు. కానీ, వస్తున్న వాటిలో ఒకట్రెండు తప్ప మిగతావన్నీ బోర్ సినిమాగా బయటకు పోతున్నవే. ఎందుకు అలాంటి నాసిరకం సినిమాలు తీస్తున్నారు. ఎందుకు -అంతంత మొత్తాన్ని ఆడియో ఫంక్షన్లకు తగలేస్తున్నారు. ఈ ప్రహసనం వెనుక అసలు లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకడం కష్టం.
వారసత్వ నటులను తెచ్చి, చిత్రాలు నిర్మించి బలవంతంగా ప్రేక్షకులను ‘ఆదరించండో’ అంటూ ప్రకటనలు గుప్పిస్తే సరిపోతుందా? హీరో పాత్రను ఆ వారసుడు పోషించగలడా? హీరోకు తగిన ఆహార్యం అతనిలో ఉందా? సంభాషణలు పలుకగలడా? హావభావాలు చూపించగలడా? పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలడా? లాంటి ఆలోచనలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. వారసత్వం వుంది. కోట్ల పైకం వుంది. ఈలలేసే అభిమానులున్నారు అన్న ధైర్యంతోనే ఆడియన్స్ మీదకు వారసులను వరుసపెట్టి వదులుతున్నారన్న అసంతృప్తులు ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. అందుకే చిత్రసీమ రాధేయుని రథ చక్రంలా కుంగిపోతుంది. పెరిగిన సాంకేతిక విజ్ఞానాన్ని -టాలీవుడ్ కొత్త ఆలోచనలతో వాడుకుంటుంది. ప్రేక్షకులను మభ్యపెడుతూ -చిత్రం మొదలుపెట్టడంతోనే ‘్ఫస్ట్‌లుక్’లు వదులుతున్నారు. చిత్ర నిర్మాణం పూర్తికాకముందే ‘టీజర్’ను రుద్దుతున్నారు. ‘ఫేస్‌బుక్’ల్లో, ట్విట్టర్లలో ప్రచార పటాటోపాన్ని పెంచేస్తున్నారు. సినిమా కూడా వ్యాపారమే కనుక -ఫ్రీగా వచ్చిన మాంద్యాన్ని వాడుకోవచ్చు, తప్పులేదు. కానీ, శృతిమించి ప్రేక్షకులను మభ్యపెట్టడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సి వస్తుంది. టీజర్‌కు కోట్లలో వ్యూస్ వచ్చాయని, లక్షల్లో ‘లైక్స్’ అందాయన్న డబ్బా కొట్టుడు ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైంది. ఇలాంటి ఎత్తుగడలకూ ప్రేక్షకుడూ అలవాటుపడిపోయాడు. ఫస్ట్‌లుక్ చూసి ఫలితం ఎలా ఉండబోతుందో చెప్పేయగల స్థాయికి వచ్చేశాడు.
నిజానికి టీజర్లు, వ్యూస్, లైక్స్, ఆడియో ఫంక్షన్ల ప్రభావానికి గురై ఆడియన్స్ సినిమాకు పరుగున వచ్చేస్తారనేది ఉత్తిమాట. చిత్రానికి విజయం సాధించే సత్తావుంటే ఇవన్నీ వృథా ప్రయాసే. వంటకం మొదలెట్టకుండానే ఆహా ఏమిరుచి అంటే ఎవరు మాత్రం నమ్ముతారు. టాలీవుడ్ అనుసరిస్తున్న ఇలాంటి జిమ్మిక్కులు, చిలక జోస్యాల్ని ప్రేక్షకులు నమ్మేరోజులు పోయాయి. మన టాలీవుడ్ ఎలాగూ స్వర్ణయుగాన్ని వెనక్కి తేలేదు. కనీసం దాని నీడనైనా అందుకోగలిగే సినిమాలు తీస్తే -ఇలాంటి జిమ్మిక్కులతో పనుండదు. వారసత్వాన్ని పక్కనపెట్టి -టాలెంట్‌ను వెతకగలిగితే కొత్త యువత దొరుకుతారు. వెండితెరకు మళ్లీ వెలుగునిస్తారు.

-మురహరి ఆనందరావు