రాష్ట్రీయం

చారిటీ ఆసుపత్రుల ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్య సదుపాయాలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ, డిసెంబర్ 19: లాభాపేక్ష లేకుండా ఛారిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల అధినేతలతో శనివారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్టణంలో ఇలాంటి ఆసుపత్రుల్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎల్వీ ప్రసాద్, అరబిందో, టాటా వంటి సంస్థలు ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ (సిఎస్‌ఆర్)ను ఇందుకోసం వినియోగించేందుకు ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. పేదలకు వైద్యసేవలు మెరుగుపరిచేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని విధానాలను సంస్కరించనున్నట్లు చెప్పారు. ఆసుపత్రుల పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దడానికి, పారిశుద్ధ్యం, వ్యాధి నిర్థారణ పరీక్షలు వంటి సేవల్ని ఔట్‌సోర్సింగ్ చేయాల్సిందిగా సూచించారు. కేవలం సేవల్ని మాత్రమే ఔట్‌సోర్స్ చెయ్యాలని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పిజి సీట్లు పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ వున్న వైద్యవిద్య అంశాలను గుర్తించాలన్నారు. నర్సింగ్ విద్యకు అంతర్జాతీయంగా డిమాండ్ వున్న నేపథ్యంలో ఆ విద్యాసంస్థల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. పోషక విలువలున్న ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్ భవనాల నిర్మాణం త్వరితంగా పూర్తయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహాయం అందిస్తుందని చంద్రబాబు వివరించారు.