రాష్ట్రీయం

ప్రాజెక్టులే లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మహారాష్టక్రు మంత్రి హరీశ్ బృందం

హైదరాబాద్, డిసెంబర్ 21: నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు మంగళవారం మాహారాష్ట్ర వెళ్తున్నారు. తుమ్మిడిహట్టి, మేడగడ్డ బ్యారేజీల నిర్మాణంపై గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చలపై తుది నిర్ణయానికి రావడానికి హరీశ్‌రావు నాగపూర్ వెళ్తారు. మహారాష్ట్ర తరఫున ఆ రాష్ట్ర నీటి పారుదల మంత్రి గిరిష్ మహాజన్, తెలంగాణ తరఫున హరీశ్‌రావు చర్చలు జరుపుతారు. మహారాష్టల్రో ముంపుప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రాజెక్టుపై తొలుత మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇంతకుముందే ఒకసారి కెసిఆర్, హరీశ్‌రావు మహారాష్ట్ర వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించారు. ప్రాజెక్టులో మార్పులు చేసి మహారాష్టల్రో ముంపుప్రాంతాలు తక్కువగా ఉండేలా రీడిజైన్ చేశారు.
దీంతో చర్చలు ఫలవంతమయ్యాయి. తుది చర్చల కోసం హరీశ్‌రావు మంగళవారం వెళ్తున్నారు. ఆయనతోపాటు నీటిపారుదల రంగంలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఇరిగేషన్ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి, ఇఎన్‌సి మురళీధర్‌రావు, ముగ్గురు ఇంజనీర్లు హరిరామ్, భగవంత్‌రావు, ఎన్ వెంకటేశ్వర్లుతోపాటు ఒఎస్‌డి శ్రీ్ధర్‌రావుదేశ్‌పాండేలు వెళ్తారు. తుమ్మిడిహట్టి వద్ద గత ప్రభుత్వం 152మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించినా పనులు ప్రారంభించారు. అయితే, మహారాష్ట్ర భూభాగం ముంపునకు గురయ్యేలా బ్యారేజీ నిర్మాణానికి అనుమతిచ్చే ప్రశే్నలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేవేంద్ర ఫడ్నవీస్ సిఎంగా మహారాష్టల్రో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే సిఎం కెసిఆర్ ముంభైవెళ్లి ప్రాజెక్టు గురించి వారితో చర్చలు జరిపారు. తుమ్మిడిహట్టి వద్ద నుంచి 160 టిఎంసిల నీటిని తరలించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే తమ భూభాగం ముంపునకు అనుమతించబోమని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మించుకోవచ్చని సూచించారు. ఇదిలాఉండగా, కేద్ర జల వనరుల సంఘం సైతం తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత 275 టిఎంసిలకు బదులు 160 టిఎంసిలు మాత్రమే లభ్యమవుతాయని తెలిపింది. దీనివల్ల తరలించే నీటి పరిమాణం మరింత తగ్గిపోతుందని, 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద 40 నుంచి 45 టిఎంసిలకు మించి నీటిని తరలించే అవకాశం లేదని ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగానే నీటి లభ్యత పుష్కలంగా ఉండి, ముంపు సమస్యలేని కాళేశ్వరానికి 20 కిలోమీటర్ల దిగువన గోదావరిపై మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్‌కోస్ ప్రతిపాదించింది. ఇక్కడ ముంపు నదీ గర్భంలోనే ఉంటుంది. ఇక్కడినుంచి ఎల్లంపల్లిదాకా గోదావరిపై మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికోసం మహారాష్ట్ర ఆమోదం అవసరం. దీనికోసం తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో ఒక బృందం మహారాష్ట్ర వెళ్తోంది. పెన్‌గంగ బ్యారేజీ విషయంలో మహారాష్ట్ర సానుకూలంగా స్పందించడంతో ఈ ప్రాజెక్టులోనూ సానుకూలంగా స్పందిస్తుందని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు.