రాష్ట్రీయం

గ్రామస్థాయనుంచి పార్టీని పటిష్ఠం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాగత ఎన్నికలపై ఇక దృష్టి పెడతాం
గృహాల కేటాయింపులో రాష్ట్రానికే కేంద్రం పెద్దపీట
బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో హరిబాబు

విజయవాడ, నవంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు గాను సంస్థాగత ఎన్నికల నిర్వహణపై ఇక దృష్టి సారించోతున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తున్నదంటూ దేశవ్యాప్తంగా 2,35,000 గృహాలు మంజూరు కాగా అందులో లక్షా 93వేలు రాష్ట్రానికే కేటాయింపు జరిగిందంటే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సహకారం కారణమని ఆయనన్నారు. బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం శనివారం నగరంలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ నూతన రాష్ట్రం నుంచే పరిపాలన సాగాలని బిజెపి మొదటి నుంచి కోరుతున్నట్లుగా చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నిస్తుండటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో వున్న బలమైన తీర ప్రాంతాన్ని సక్రమంగా వినియోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మారిటెయిమ్ బోర్డును ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయటంపై హర్షం వ్యక్తం చేసారు. దీనివలన నౌకాశ్రయాల అభివృద్ధి ఒకే గొడుకు కిందకు రాగలదన్నారు. కొత్త ఓడరేవుల నిర్మాణంలో స్థానికంగా వుండే మత్స్యకారుల నుంచి ఆందోళనలు వచ్చే అవకాశం వున్నందున దీన్ని అధిగమించేందుకు ఎక్కడికక్కడ ఫిషింగ్ జట్టీలను ఏర్పాటుచేయాలని హరిబాబు సూచించారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం ఇప్పటికి 82 శిక్షణా శిబిరాలు నిర్వహించగా 15వేల మంది కార్యకర్తలు శిక్షణ పొందారని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన కొంత ప్రయోజనం జరిగినప్పటికీ నష్టం కూడా అదే స్థాయిలో జరగటం బాధాకరమన్నారు. ప్రధానంగా కరువుతో అల్లాడిన రాయలసీమలో అన్ని చెరువులు జలకళతో నిండాయని అన్నారు. కేంద్రం నుంచి తగిన సహాయం రాగలదన్న ఆశాభావం వ్యక్తం చేసారు. రాష్ట్ర విపత్తుకు బిజెపి కేంద్ర కమిటీ కోటి రూపాయల విరాళాన్ని అందచేసిందన్నారు. దక్షిణ భారతదేశ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్‌జీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సాగుతున్నదని అన్నారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వం అంచనాలకు మించి జరిగిందంటూ అందర్నీ అభినందించారు. ఈ సమావేశంలో మాజీ కేంద్రమంత్రులు కావూరు సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీలు కంతేటి సత్యనారాయణరాజు, సోము వీర్రాజు, శాసనసభా నేత విష్ణుకుమార్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరి జిఆర్ రవీంద్రరాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, దారా సాంబయ్య, ఎం.అయ్యాజీవేమ, కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.