తెలంగాణ

బేడీలు వేయకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్టుకు తీసుకువచ్చేటప్పుడు ఖైదీలకు సంకెళ్లు వద్దు!
కరీంనగర్ అడిషనల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆదేశం
మోహన్‌రెడ్డి, అనుచరుల బెయిలు పిటిషన్లు కొట్టివేత

కరీంనగర్ , డిసెంబర్ 10: జైలు నుండి కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో ఖైదీలకు సంకెళ్లు వేయొద్దని కరీంనగర్ అడిషనల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి టి.మాధవి గురువారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎఎస్‌ఐ మోహన్ రెడ్డి కేసులో నిందితుల తరఫున సంకెళ్లు వేయొద్దని పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. అక్రమ ఫైనాన్స్ కేసులో నిందితుడైన ఎఎస్‌ఐ మోహన్ రెడ్డి, అతని అనుచరులు కోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను న్యాయమూర్తి మాధవి కొట్టివేశారు. హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన దోనపాటి వెంకటరమణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిలు మంజూరు చేయాలని ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి, ఇట్టిరెడ్డి శ్రీపాల్ రెడ్డి, కత్తి రమేష్ పిటిషన్లు దాఖలు చేశారు. మరో కేసులో చాట్ల కొమురయ్య ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు పూదరి శ్రీనివాస్ తదితరులపై కేసు నమోదు చేశారు. ఇందులో శ్రీనివాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కొట్టివేశారు. నిందితులపై జిల్లా వ్యాప్తంగా పలు కేసులు నమోదవుతున్నాయని, కేసు దర్యాప్తు జరుగుతోందని, ఈ సమయంలో బెయిలు ఇవ్వకూడదని సిఐడి అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఫైనాన్స్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్, అతని అనుచరుడు మహిపాల్ రెడ్డి రిమాండ్ గురువారంతో ముగుస్తుండగా, జైలు పోలీసులు చేతులకు సంకెళ్లు వేసుకొని కోర్టుకు తీసుకువచ్చి హాజరుపర్చారు. అయతే, సంకెళ్లు వేయకుండా వారిని తీసుకురావాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ ఈ నెల 18వరకు రిమాండ్ కాలాన్ని పొడిగించారు. కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత ప్రసాదరావు ఆత్మహత్య కేసులో మోహన్ రెడ్డి మినహా మిగతా నిందితులు జిల్లా కోర్టులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను విచారించేందుకు ఈ నెల 14కు వాయిదా వేసింది. బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులపై వివిధ పోలీస్‌స్టేషన్లలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ సిఐడి అధికారులు ఇప్పటివరకు కేవలం మూడు కేసులు మాత్రమే నమోదు చేయడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.