రాష్ట్రీయం

సచివాలయం కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడునెలల తర్వాత బాబు రాక * మంత్రులు,అధికారుల హడావిడి
హైదరాబాద్, నవంబర్ 28 : ఆంధ్రప్రదేశ్ సచివాలయం శనివారం కళకళలాడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సచివాలయానికి వచ్చారు. దాదాపు మూడునెలల తర్వాత చంద్రబాబు రావడంతో సచివాలయం కళకళలాడింది. ముఖ్యమంత్రి ఛాంబర్ ఉండే ఎల్‌బ్లాక్ వద్ద గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్‌బ్లాకు చుట్టుపక్కల కూడా బాంబుస్క్వాడ్‌లు అడుగడుగునా తనిఖీ చేశాయి. గత మూడు రోజుల నుండే ఈ బ్లాకులోకి వెళ్లే వారిని నియంత్రించారు. చంద్రబాబు ఉండే ఎనిమిదో అంతస్తుకు మంత్రులు, ఉన్నతాధికారులు మినహా ఎవరినీ అనుమతించలేదు. సచివాలయంలోకి వచ్చే విజటర్లను కూడా శనివారం పోలీసు సిబ్బంది నియంత్రించారు. సచివాలయానికి ముఖ్యమంత్రి కంటే ముందే మంత్రులంతా వచ్చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతోందా అన్నట్టు అక్కడి వాతావరణం అనిపించింది. ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించినంత సేపు దాదాపు మంత్రులంతా సమావేశం హాలు చుట్టుపక్కలే తచ్చాడుతూ కనిపించారు.
2016-17 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్న నేపథ్యంతోపాటు, క్యాలెండర్ సంవత్సరం ముగుస్తుండటంతో ప్రధానమైన శాఖల నిర్వహణపై రాష్ట్ర సచివాలయంలో సమీక్షించాలని నెలరోజుల క్రితమే చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దాంతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పటికే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పలు పర్యాయాలు సమీక్షించారు. వివిధ శాఖల మంత్రులు కూడా తమతమ శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి, భవిష్యత్తులో చేపట్టబోయే పథకాలు, కార్యక్రమాలు, వాటికోసం అవసరమైన నిధులు తదితర అంశాలపై చర్చించారు. అన్ని శాఖల ఆర్థిక అవసరాలపై ఆర్థిక శాఖ కూలంకషంగా సమీక్షించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికా కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించడంతో ఈ కోణంలో వివిధ శాఖల అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ముఖ్యమంత్రి సోమవారం తిరిగి హైదరాబాద్ నుండి విమానంలో వెళుతున్నారు. (చిత్రం) సచివాలయంలో ఆర్థికశాఖ అధికారులతో సమీక్షిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రి యనమల, చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ ఉన్నారు