రివ్యూ

శృతిమించిన ఘాటు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*గుంటూర్ టాకీస్ (బాగోలేదు)

తారాగణం:
సిద్ధు, నరేష్, మహేష్ ముంజ్రేకర్, రేష్మి, శ్రద్ధాదాస్,
మంచు లక్ష్మి, రాజారవీంద్ర, శ్యామల, రఘుబాబు, స్నిగ్ధ, తదితరులు.
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాత:
రాజ్‌కుమార్ ఎం.
దర్శకత్వం:
ప్రవీణ్ సత్తారు

ఎలాగోలాగ హిట్ కొట్టేసి తీరాలన్న లక్ష్యంతో తీసిన చిత్రంగా ‘గుంటూర్ టాకీస్’ కనబడుతోంది తప్ప, సినిమాకు అనుకున్న కానె్సప్ట్ ఏమిటి? నడిపించిన తీరేమిటి? ముగించిన విధమేమిటి అని క్షణంసేపైనా ఆలోచించినట్టు అనిపించని చిత్రమిది. ఒకవేళ అలా ఆలోచించి తీసినట్లైతే ‘గుంటూర్ టాకీస్’ కథ కాస్తంతైనా బావుండేది. ఇంతకీ ఇందులోని కథేమిటంటే..
గిరి (నరేష్), హరి (సిద్ధు) ఓ మెడికల్ షాపులో అరకొర జీతాలకు పని చేసే పనోళ్లు. తమ అవసరాల కోసం చెయ్యివాటాన్ని రాత్రిపూట తాళం వేసిన ఇళ్లల్లో చూపిస్తుంటారు. అలా దొంగతనాలు చేస్తున్న ప్రక్రియలో వారికి ఎదురైన సంఘటనలు, అందులోంచి బయటపడిన (?) విధానం మిగతా స్టోరీ. ఇలా పగలు పని -రాత్రి దొంగతనాలు చేస్తూ కాలం గడిపే చిల్లరమల్లర దొంగతనాల కథలు మనం అనేకం చూసేశాం. కానీ ఈ సినిమాలో ఒకిన్ని మితిమీరిన అసభ్య సన్నివేశాలు, అర్ధంలేని స్టేట్‌మెంట్లు ఎక్స్‌ట్రా. అన్నిటికంటే ఆడియన్స్‌ని కొంచెం ఇబ్బందిపెట్టె అంశం ముగింపు. సినిమాలో పాత్రలు మొదట్నించీ చివరివరకూ ఎలా ఎలా ఉన్నా, దొంగిలించిన సొమ్ము దొరికినట్టు, దాన్ని అసలైన వారికి చేర్చినట్టు చూపించేవారు. పోనీ అలా అసలైన వారికది అన్యాయార్జితమైతే దాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పడం జరిగేది. కానీ ఇందులో దొంగతనానికి గురైన పది లక్షల్లో అయిదు లక్షలు రికవరీ చేసినట్టు, మిగిలిన ఐదు లక్షలూ అది దొంగిలించిన గిరివద్దే ఉన్నట్టు, దాంతోవారు (గిరి, హరి కుటుంబాలు) ఎంజాయ్ చేస్తున్నట్టు ముగింపు చెప్పారు. అసలిలాంటివి జరుగుతాయా? జరగవా? అన్నది పక్కనపెట్టి చూస్తే, సమాజానికి ఏం చెబుదామని చిత్ర బృందం అనుకుంటోందో అన్నది ఆలోచిస్తే ఏమాత్రం అంచనాలకు అందదు. సినిమా చూసి మారిపోతారా? అన్న వాదానికి వెళ్లొద్దు. కానీ ఇలాంటివి- అంటే దొంగతనం చేసి సొమ్ము దొరకనివ్వకుండా దాంతో మనం ‘మజా’ చేసుకోవచ్చన్న నిర్బీధ్యతా భావానికి కొమ్ముకాసినట్టు తప్పకుండా అవుతుంది. అందునా ఇలాంటి ఆలోచనాధార గతంలో జాతీయ అవార్డు పొందిన ప్రవీణ్ సత్తారు నుంచి రావడం మరీ దురదృష్టకరం. ఇక ఇందులో సంభాషణలు ఎంతగా ఇది ‘ఎ’ సర్ట్ఫికెట్ పొందినదైనా, మెచ్యూర్డ్ మనస్తత్వంతో ఉండే పెద్దవారిని సైతం కలవరపెట్టే స్థాయిలో ఉన్నాయి. అంతకుమించి సంభాషణాకర్తల (ఈ చిత్రానికి ఇద్దరు మాటలు రాశారు) అధోస్థాయి అభిరుచికి అద్దంపట్టాయి. ప్రస్తావించడానికే ఇబ్బంది కలిగించే పదాలు ఎన్నో యధేచ్ఛగా దొర్లాయి. ఇక అన్నిటికంటే దారుణమైన సంగతి. ‘లఘుశంక’ నేపధ్యంగా సన్నివేశాలు అనేకం చూపించారు. ముంజ్రేకర్ పోలీసుశాఖ గురించి మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. చిత్ర విరామం సూచికగా ‘పోసుకురండి’ అన్న రైటప్ చూపడాన్ని చూస్తే అంతకన్నా మంచి కాప్షన్ దొరకలేదా? అన్న జాలి దర్శకుడిపై కలిగింది. పాత్రధారుల నటన విషయానికొస్తే నిశ్చయంగా నరేష్‌దే ఇందులో పెద్ద నిడివి పాత్ర. కానీ కథా చిత్రణలోని అపరిపక్వతలవల్ల అది రాణించలేదు. సిద్ధుకూడా పాత్రపరంగా సహజంగానే నటించడం, టీవి యాంకర్ రేష్మిని ‘లిప్‌లాక్’ సీన్స్‌కోసమే తీసుకున్నట్టైంది. మిగిలిన విధంగా ఆమె పాత్ర పరిధేం కనిపించలేదు. శ్రద్ధాదాస్ పోషించిన రివాల్వర్ రాణి పాత్రలో చూపిన వికృతాలు విశ్వరూపం దాల్చి మహామోటగా అనిపించాయి. మంచు లక్ష్మి కూడా చిన్నపాత్రలో కనిపించింది. శ్రీ చరణ్ పాటల్లో ‘నీ సొంతం..’ ఒక్కటే ఓకే! మొత్తానికి ‘సెన్సారు పనితనం’ ఇంకా బాగుండాల్సిన అవసరాన్ని ‘గుంటూర్ టాకీస్’ చెప్పకనే చెపుతోంది. అలాంటి అవసరాన్ని కలిగించని విధంగా ప్రవీణ్ తన ప్రావీణ్యాన్ని రాబోయే చిత్రాల్లో చూపుతారని అనుకుందాం.

-అన్వేషి