జాతీయ వార్తలు

జిఎస్‌టి బిల్లుకు మోక్షం లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిగిలిన మూడు రోజులు చాలా కీలకమే
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లును ఆమోదింపజేసుకోలేకపోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం సూచనప్రాయంగా తెలియజేసారు. అయితే మరో కీలక ఆర్థిక సంస్కరణల బిల్లు అయిన దివాలా బిల్లును ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారు. రకరకాల కారణాలతో కాంగ్రెస్ పార్టీ జిఎస్‌టి బిల్లును జాప్యం చేస్తోందని ఆయన ఆరోపిస్తూ, భారత దేశం వృద్ధి మందగించేలా చూడడంలో కొంతమందికి పైశాచిక ఆనందం లభిస్తుందన్నారు. ‘్భరత్ వృద్ధి మందగించేలా చూడ డం ద్వారా కొంతమంది పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. అయితే దేశ ప్రయోజనాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే పైశాచిక ఆనందం అది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించకూడదు’ అని జైట్లీ అన్నారు. శీతాకాల సమావేశాల్లో మిగిలి ఉన్న మూడు రోజులు అత్యంత కీలకమైనవి., ఈ మూడు రోజుల్లో రాజ్యసభలో మధ్యవర్తిత్వ చట్టం, కమర్షియల్ కోర్టు చట్టంలో మార్పులకు ఆమోదం లభించేలా చూడడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది’ అని ఆయన చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారంతో ముగియనున్న విషయం తెలిసిందే. ‘జిఎస్‌టిని ఆలస్యం చేయడానికి కారణాలు పూర్తిగా దీనికి సంబంధం లేనివనే విషయంలో నాకెలాంటి సందేహం లేదు. నేను చేయలేనప్పుడు వేరెవరైనా ఎందుకు చేయాలనేది ఈ కారణాల్లో ఒకటని నేను అనుమానిస్తున్నాను’ అని శనివారం ఇక్కడ ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ జైట్లీ అన్నారు. లోపభూయిష్టమైన జిఎస్‌టికన్నా ఆలస్యమైన జిఎస్‌టియే మేలని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగ నిర్దేశిత టారిఫ్‌ల విషయంలో తమ మొండివైఖరిని వీడాలని ప్రతిపక్షాన్ని ఒప్పించడానికి తాము ఇప్పటికీ ప్రయత్నిస్తామని జైట్లీ అన్నారు. ‘రాజ్యాంగ నిర్దేశిత టారిఫ్‌లు నిజానికి భావితరానికి గుదిబండ లాంటివి. అయితే ఇలాంటి పరిస్థితులను సృష్టించవద్దని మేము వారిని కోరుతాము’ అని ఆర్థిక మంత్రి అన్నారు.
ఇదిలా ఉండగా ‘ఈ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదు. అయినప్పటికీ మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతాము. అయితే ఇది దానికి ఇది సరయిన సమయం కాదు. 2016 ఏప్రిల్ 1నాటికి జిఎస్‌టిని అమలు చేయాలనుకోవడం ఎంతమాత్రం సరయినది కాదని నా అభిప్రాయం’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు.
రాజ్యసభలో అధికార ఎన్డీఏకు మెజారిటీ లేక పోవడంతో జిఎస్‌టి బిల్లు అక్కడ ఆగిపోయిన విషయం తెలిసిందే. 2016 ఏప్రిల్ నుంచి జిఎస్‌టిని అమలు చేయాలని ప్రభుత్వం అనుకొన్న విషయం విదితమే. కాగా, కాంగ్రెస్ పార్టీ దివాలా బిల్లును సమర్థిస్తుందా అని అడగ్గా, ఏది అత్యవసరమో, ఏది సరయినదో దాన్ని ముందుగా ఆమోదింపజేసుకోవడానికి తాము సుముఖమేనని ఆనంద్ శర్మ చెప్పారు.
పార్లమెంటులో రాబోయే మూడు రోజులు ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవని, ఈ సంస్కరణల్లో కొన్నింటిని ఆమోదింపజేసుకోవడానికి ప్రభు త్వం ప్రయత్నించవచ్చని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆర్థిక సంస్కరణలకు భారతీయ రాజకీయా మద్దతు సంపాదించడం అనేది ఓ పెద్ద సవాలని కూడా ఆయన అన్నారు.

శనివారం జరిగిన ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ