రాష్ట్రీయం

గోదావరి డెల్టాకు అదనంగా సీలేరు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, డిసెంబర్ 19: విశాఖ ఏజెన్సీలోని సీలేరు జలాశయం నుండి గోదావరి డెల్టాకు అదనంగా 1,500 క్యూసెక్కుల నీటిని శనివారం నుంచి విడుదల చేస్తున్నామని సీలేరు కాంప్లెక్స్ ఎస్‌ఇ మురళీమోహన్ తెలిపారు. గోదావరి డెల్టాలో రబీ పంటకు సీలేరు జలాశయం నుంచి 40 టిఎంసిల నీటిని సరఫరా చేయడానికి జెన్‌కో అధికారులు అంగీకరించారన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 16 నుంచి పవర్ జనరేషన్ ద్వారా 4,500 క్యూసెక్కుల నీటిని, శాడీలు డ్యామ్ ద్వారా మరో 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 5,200 కూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయతే ఈ నీరు రబీ పంటకు పూర్తి స్థాయిలో సరిపోనందున అదనంగా మరో 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు కోరారని ఎస్‌ఇ మురళీమోహన్ తెలిపారు. దీంతో శనివారం సాయంత్రం నుంచి డొంకరాయి జలాశయం ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా గోదావరి డెల్టాకు సీలేరు జలాశయం నుంచి మొత్తం 6,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టవుతుందని ఎస్‌ఇ తెలిపారు.