గుంటూరు

పెండింగ్‌లో ఉన్న కొత్త ఓటర్ల దరఖాస్తులను పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 27: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో నూతన ఓటర్ల నమోదు, మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇఆర్‌ఒలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ఓటర్ల మార్పులు, చేర్పులకు సంబంధించి నూతనంగా వచ్చే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. 17 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 2.78 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, మూడు, నాలుగు రోజుల్లో దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా రెవెన్యూ అధికారిణి శ్రీలత, ఆయా నియోజకవర్గాల అధికారులు పాల్గొన్నారు.

సమాజం ఆలోచనావిధానం మారకపోతే మహిళాభ్యున్నతి సాధ్యం కాదు
* ఆచార్య షాహిదా ముర్తాజ్ * వర్సిటీలో ఘనంగా ప్రారంభమైన జాతీయసదస్సు
నాగార్జున యూనివర్సిటీ, ఫిబ్రవరి 27: దేశీయ సమాజం యొక్న ఆలోచనా విధానంలో స్పష్టమైన, సమూలమైన మార్పు రానంత వరకూ దేశంలో మహిళల అభ్యున్నతి సాధ్యం కాదని హైదరాబాద్ వౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ సోషల్‌సైనె్సస్ డీన్ ఆచార్య షాహిదా మూర్తాజ్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సోషియాలజీ, సోషల్‌వర్క్ విభాగాల ఆధ్వర్యంలో ‘సమకాలీన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు-పరిష్కారాలు’ అనే అంశంపై వర్సిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగిన జాతీయసదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె కీలకోపన్యాసం చేశారు. ఆచార్య డాక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఆచార్య షాహిదా ముర్తాజ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలు అనేక పథకాలు రూపొందించినప్పటికీ మహిళలు అభ్యున్నతి సాధ్యం కాలేదని అన్నారు. వర్సిటీ ఇంఛార్జి వీసీ ఆచార్య కూన రామ్‌జీ మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా ముందుకు వచ్చినప్పుడే దేశ సంపూర్ణ ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. సదస్సు డైరక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపై ఈ సదస్సులో చర్చించనున్నామని, రెండురోజుల పాటు జరిగే ఈ సదస్సులో సుమారు 250 పరిశోధనా పత్రాలు సమర్పించబడ్డాయని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కె జాన్‌పాల్, చిలకలూరిపేట ఎ ఎంజి సంస్థ అధినేత డాక్టర్ అరుణ్‌కుమార్ మహాంతి ప్రసంగించారు. అనంతరం వర్సిటీ రెక్టార్ ఆచార్య జాన్‌పాల్ తదితరులు సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చంద్రకుమార్, వర్సిటీ మహిళా అధ్యయన కేంద్రం డైరక్టర్ ఆచార్య స్వరూపరాణి, సోషియాలజీ విభాగాధిపతి ఆచార్య సరస్వతీరాజు అయ్యర్, ఫూలే అధ్యయన కేంద్రం డైరక్టర్ ఆచార్య త్రిమూర్తి రావు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, పరిశోధకులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో జానపద విశ్వ విద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు
* ఏపీ జానపద అకాడమి చైర్మన్ పొట్లూరి హరికృష్ణ
* అన్నికళలకు మూలం జానపదమే * కదంతొక్కి, పదంపాడిన జానపద కళాకారులు
గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 27: నూతనంగా ఆవిర్భవించిన మన నవ్యాంధ్రప్రదేశ్ అమరావతిలో మొట్టమొదటి సారిగా జానపద విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తగు ప్రతిపాదనలతో కూడిన నివేదికను అందజేయడం జరిగిందని ఏపీ జానపద అకాడమి చైర్మన్ పొట్లూరి హరికృష్ణ పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఇక్కడి బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై రాష్ట్ర జానపద అకాడమి అమరావతి ఆధ్వర్యాన బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సంయుక్త సహకారంతో జయహో జానపదం జానపదకళల సమాహార సంరంభం ప్రత్యేక ప్రదర్శనలను ఓ ఉత్సవంలాగా నిర్వహించారు. సభకు ఏపీ నాటక అకాడమి ఉపాధ్యక్షుడు, సాహితీవేత్త డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వనలతో ఉత్సవాలను ప్రారంభించిన హరికృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కళాకారులన్నా, కళలన్నా అమితగౌరవాన్ని చూపిస్తున్నారని, జానపద కళల పట్ల ప్రత్యేకించి ఆయనకు అభిమానం ఉందన్నారు. ముఖ్యఅతిథి శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ అన్ని కళలకు మూలం మన జానపదమేనన్నారు. ముఖ్యమంత్రి చొరవతో ఈ కళ నూతన కాంతులతో వెల్లివిరియగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. విశిష్ట అతిథి డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి మాట్లాడుతూ జానపద కళారూపాల ప్రక్రియల ఔన్నత్యాన్ని చాటిచెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, తనవంతుగా తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు చేస్తున్న సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు తోడు వీటికి కూడా ఇతోదికమైన సహకారం అందిస్తామన్నారు. వెంకన్న ఆలయ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, సభ్యుడు ఊటుకూరు నాగేశ్వరరావు, లంకా విజయబాబు తదితరులు కళాకారులను అభినందించారు. అకాడమి సభ్యుడు, గాయకులు డప్పు శ్రీను, మరోసభ్యుడు డాక్టర్ చిట్టినేని శివకోటేశ్వరరావు, రమణ తదితరులు జానపద కళల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కోరారు. అనంతరం పలువురు జానపద కళాకారులు తమ ఆటపాటతో కదంతొక్కి పదంపాడారు. లయబద్దంగా వీరు చేసిన విన్యాసాలు, డప్పు వాద్యాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.